Venu Swamy : నన్ను వదలండి అంటూ ప్రాధేయపడ్డా.. వేణుస్వామిని వదలని హీరోయిన్లు.. మరోసారి ఆమెతో అలా

- Advertisement -

Venu Swamy : ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాలు, క్రికెట్, సినిమా ఇలా టాపిక్ ఏదైనా సరే ప్రెడిక్షన్స్ ఇస్తూ ఉంటారు. సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పడం, నిజంగానే జీవితంలో విడిపోవడంతో ఆయన ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చి ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీ అయిపోయారు. అప్పటి నుంచి వేణు స్వామి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని.. జగన్ మరోసారి సీఎం అవుతారని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. దీనిపై చాలా మంది నెటిజన్లు వేణు స్వామిని తిడుతూ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఇక తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా కూటమి ఘన విజయం సాధించడంతో వేణు స్వామి రియలైజ్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. అందులో మళ్లీ జాతకం చెప్పను, నన్ను క్షమించండి అంటూ ప్రాధేయపడ్డారు. దీంతో ఆయన్ను సోషల్ మీడియలో నెటిజన్లు ఆడేసుకున్నారు. దీంతో ఇక వేణు స్వామి కనిపించరేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఓ హీరోయిన్‌తో పూజలు నిర్వహిస్తూ ఆయన మరో సారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

- Advertisement -

వేణు స్వామి చెప్పిన జాతకం రాంగ్ అవుతున్నప్పటికీ ఆయనను హీరోయిన్లు వదలడం లేదు. తాజాగా కన్నడ బ్యూటీ నిశ్విక ఆయన వద్దకు వచ్చి పూజలు చేయించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో రష్మిక, నిధి అగర్వాల్ కూడా ఈయనతో పూజలు జరిపించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి ఖాతాలో హీరోయిన్ నిషిక కూడా చేరింది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తప్పు చెప్పినా హీరోయిన్స్ ఆయనను వదలడం లేదు, రాను రాను వేణు స్వామి పాన్ ఇండియా జ్యోతిష్యుడు అవుతాడేమో అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here