ప్రస్తుతం పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాల బుడ్జెట్స్ ని లెక్కగడితే కనీసం 2000 కోట్ల రూపాయిలు అయినా ఉంటుంది. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ అనే చిత్రం ఈనెల 16 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం , హిందీ , మలయాళం మరియు కన్నడ బాషలలో విడుదల కానుంది.

ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు తిరుపతి లో జరగబోతుంది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిన్న జియ్యర్ స్వామి విచ్చేయబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మరియు పాటలకు అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఫ్లాప్ అవుతుంది అని ఇసుమంత కూడా ఎవరికీ అనిపించడం లేదు. అయితే ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి చేసిన కొన్ని కామెంట్స్ అభిమానులను భయాందోళనకు గురి చేస్తుంది.

ఆయన ఏమన్నాడంటే ప్రభాస్ కి ప్రస్తుతం అర్ధాష్టమ శని నడుస్తుందని, ఆయన ఎంత ప్రయత్నం చేసిన హిట్లు రావని,ముఖ్యంగా 2023 వ సంవత్సరం ఆయనకీ ఏమాత్రం కలిసిరాదని చెప్పాడు. సినీ తారల విషయం లో గతం లో వేణు గోపాల స్వామి చెప్పినవన్నీ నిజం అయ్యాయి. సమంత మరియు నాగ చైతన్య విడిపోతారని, రామ్ చరణ్ – ఉపాసనలకు సంతానం ఆలస్యం గా కలుగుతుందని. సమంత అనారోగ్యానికి గురి అవుతుందని ఇలా ఆయన చెప్పినవన్నీ నిజం అయ్యాయి.

ఇప్పుడు ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఆయన చెప్పిన మాటలు ఎక్కడ నిజం అవుతాయో అని అభిమానులు భయపడుతున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ సినిమాతో పాటుగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సలార్’ చిత్రం కూడా విడుదల అవ్వబోతుంది. ఆదిపురుష్ చిత్రం ఫ్లాప్ అయినా పెద్ద పట్టించుకోరు కానీ, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సలార్ చిత్రం ఫ్లాప్ అయితే అభిమానులు తట్టుకోగలరా?, అసలు వేణు స్వామి కామెంట్స్ లో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే, ఈ నెల 16 వరకు ఆగాల్సిందే.
