ఈ రోజుల్లో ఒక్క పెళ్లి కావడమే గగనం అయిపోతుంటే.. కొందరు ఏకంగా మూడేసీ, నాలుగేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ జాబితాలోకే వస్తుంది మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వస్తుంది.. ఈ మాటలు అన్నది మరెవరో కాదు.. ప్రముఖ జొతిష్యుడు వేణు స్వామి. సెలబ్రిటీల జీవితాల్లో జరగబోయే విషయాలని ముందుగానే పసి గట్టి చెప్పేసే ఈయన..మెగా కుటుంబంలో ను నాలుగు పెళ్లిలు చేసుకుంటారు అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. ఆయన కూతురు శ్రీజ, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇద్దరి జీవితాల్లోనూ నాలుగు పెళ్లిలు రాసి ఉన్నాయని చెప్పుకొచ్చారు.
గత కొన్నాళ్లుగా శ్రీజ తన రెండవ భర్త కళ్యాణ్ దేవ్ తో దూరంగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లు విడాకులు కూడా తీసుకున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేనా, ఈ చిరు చిన్న కూతురు మూడో పెళ్లికి సిద్ధమైందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు భర్తలను వదిలేసిన ఈమె ముచ్చటగా మూడో భర్తగా తన క్లోజ్ ఫ్రెండ్ ను చేసుకోబోతుందని ఫిలింనగర్లో వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఆమె జాతకం ప్రకారం గురువు ఆరవ స్థానంలో ఉన్నాడట. శ్రీజ జాతకం ప్రకారం శని దృష్టి గురువు మీద ఉంది. కుజుడు నీచంలో ఉన్నాడట. అందువల్ల ఆమె జాతకంలో మూడో పెళ్లి జరుగుతుంది. అంతేకాకుండా శ్రీజ జాతకం ప్రకారం మూడు నుంచి నాలుగు పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పాడట.
ఇది ఇలా ఉంటే శ్రీజ మూడో పెళ్లిపై కొందరు సినీ సెల బ్రిటీలు స్పందించారు.. అమ్మాయి పెళ్లి చేసుకోకపోతేనే బెటర్ అని సలహాలిచ్చారట. నిజానికి ఈ పెళ్ళి చిరంజీవికి ఇష్టం లేదట. కానీ , పవన్ కళ్యాణ్ నే దగ్గరుండి ఓప్పించారనే న్యూస్ కూడా బయటకి వచ్చింది. నవంబరులో వీళ్ల పెళ్లి జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీజ చిరంజీవి పరువు తీస్తుందంటున్నారు ఫ్యాన్స్.