Venu Gopal Swamy : ఈ ఏడాది ప్రభాస్ సినిమాల నుండి తప్పుకుంటాడు అంటూ వేణు గోపాల స్వామి షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Venu Gopal Swamy : ఎల్లప్పుడూ అశుభాలు మాట్లాడుతూ ఫ్యాన్స్ కి నెటిజెన్స్ కి చిరాకు రప్పించే వేణు గోపాల స్వామి ఈసారి కూడా అదే చిరాకు కలిగించే మాటలతో ఆడియన్స్ కి కోపం రప్పిస్తున్నాడు. నోరు ఉంది కదా అని , నోటికి వచ్చింది చెప్పుకుంటే వచ్చే ఈ దొంగ స్వామిజి, అప్పుడే పుట్టిన రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా జాతకం లో కూడా లోపాలు ఉన్నాయి అని , పెరిగి పెద్దయ్యాక ఆమె ఒక ఆరోగ్య సమస్య వస్తుంది అంటూ నోరు జారాడు.

దీనికి రామ్ చరణ్ ఫ్యాన్స్ నుండి ఇతనికి చాలా తీవ్రమైన నెగటివ్ ట్రోల్ల్స్ పడ్డాయి. ఇతను కనిపిస్తే వాళ్ళు కొట్టేస్తారు అనే రేంజ్ లో తయారైంది పరిస్థితి. అలాగే ప్రభాస్ హిట్స్ రావడం కష్టమే, ఇతన్ని నమ్మి భారీ బుడ్జెట్స్ పెడితే నిర్మాతలు మునిగిపోతారు అని అప్పట్లో ఒక కామెంట్ చేసాడు. కానీ ప్రభాస్ రీసెంట్ గానే ‘సలార్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ఇతని నోటికి తాళం వేసాడు.

ఇప్పుడు రీసెంట్ గా ఆయన మరో కామెంట్స్ చేసాడు..2024 కి ఒక అగ్ర హీరో ఆరోగ్య సమస్యలతో సినిమాల నుండి శాశ్వతంగా తప్పుకుంటాడు అని మరో కామెంట్ చేసాడు. ఆరోగ్య సమస్యలు అంటే రీసెంట్ గా ప్రభాస్ కి మోకాళ్ళ సర్జరీ అయ్యింది. అతన్ని పరోక్షంగా ఉద్దేశించే వేణు గోపాల్ స్వామి ఈ కామెంట్స్ చేసాడని అంటున్నారు నెటిజెన్స్.

- Advertisement -

అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తన భార్య తో విడిపోతాడని, వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కూడా ఈ ఏడాదిలోనే విడిపోతారని మరోసారి నోరు జారాడు. ఇలా శుభమా అంటూ కొత్త ఏడాది లోకి అడుగుపెడితే, ఇక్కడ కూడా అశుభాలు మాట్లాడుతూ జనాలకు చిరాకు రప్పించాడు వేణు గోపాల స్వామి. ఇలాగే అతను మాట్లాడుతూ పోతే త్వరలోనే జనాల నుండి ఇతగాడికి బదిత పూజ తప్పదని అంటున్నారు నెటిజెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here