Venkatesh : ఇండస్ట్రీ లో సీనియర్ హీరోలందరూ ఎంత మంచి స్నేహంగా మెలుగుతూ ఉంటారో మనమంతా చూస్తూనే ఉంటాం. బాక్స్ ఆఫీస్ పరంగా ఎంత పోటీ ఉన్నప్పటికీ, బయట మాత్రం నిజ జీవితంలో సొంత సోదరులు లాగ కలిసిమెలిసి ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి తో అయితే అటు వెంకటేష్, ఇటు నాగార్జున సోదరభావం తో మెలిగే తీరుని చూసి అభిమానులు మురిసిపోతూ ఉంటారు.

రీసెంట్ గానే విక్టరీ వెంకటేష్ 75 సినిమాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన లేటెస్ట్ చిత్రం ‘సైన్ధవ్’ నిర్మాతలు ఒక గ్రాండ్ ఈవెంట్ చేసారు. ఈ ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవి తో పాటుగా పలువురు హీరోలు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. చిరంజీవి వెంకటేష్ గురించి మాట్లాడిన మాటలు అందరికీ చాలా బాగా అనిపించింది. అదే విధంగా చిరంజీవి వెంకటేష్ డైలాగ్స్ చెప్పడం , వెంకటేష్ చిరంజీవి డైలాగ్స్ చెప్పడం ఈ ఈవెంట్ లో హైలైట్ గా నిల్చింది.

ఇదంతా పక్కన పెడితే గతం లో చిరంజీవి వెంకటేష్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్లిద్దరి మధ్య జరిగిన ఒక ఫోన్ కాల్ సంభాషణ గురించి చెప్తాడు. అప్పుడే చిరంజీవి దాడి చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమా చూసిన తర్వాత వెంకటేష్ చిరంజీవి కి ఫోన్ చేసి ‘సినిమా సూపర్ గా ఉండండి..కానీ ఇది మీరు చెయ్యాల్సిన సినిమా కాదు, నేను చెయ్యాల్సింది, నేను చేసి ఉంటే పెద్ద హిట్ అయ్యేది’ అని అన్నాడట.

అప్పుడు చిరంజీవి కూడా డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు నేను కూడా చెప్పాను వెంకీ, కానీ నాకు కొత్తగా ఉంటుంది ట్రై చెయ్యమంటే చేశాను, చివరికి ఫ్లాప్ అయ్యింది అని చెప్పాడట. ఈ విషయాన్నీ కూడా చిరంజీవి ఈ ఈవెంట్ లో ప్రస్తావించాడు అట. అంతే కాదు వీళ్లిద్దరి కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా కూడా తెరకెక్కబోతుంది అని ఈ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.
