Lavanya Tripati : వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా అనేక వాయిదాల తర్వాత మార్చి 1న విడుదల కాబోతోంది. తాజాగా సాంగ్ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ తన భార్య గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘ఆపరేషన్ వేలంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సందీప్ ముద్ద నిర్మిస్తున్నారు. మాజీ మిస్ యూనివర్స్ మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మార్చి 1న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

తాజాగా ఈ సినిమా సాంగ్ రిలీజ్ వేడుక మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో జరిగింది. ఈ వేడుకలో సినిమా టీమ్ సందడి చేసారు. కాలేజ్ స్టూడెంట్స్ వరుణ్‌ని అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. ‘బాబాయ్‌తో సినిమా ఎప్పుడు చేస్తున్నారు?’ అన్న స్టూడెంట్ ప్రశ్నకు వరుణ్ తను వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ‘మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?’ అని అడిగిన ప్రశ్నకు ‘నా ఫేవరెట్ హీరోయిన్‌ను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నానని.. తను ఇంట్లో ఉందని’ సమాధానం చెప్పారు.

‘లావణ్య త్రిపాఠి కాకుండా ఇష్టమైన హీరోయిన్ ఎవరని’ అడిగిన ప్రశ్నకు ‘సాయి పల్లవి’ అంటూ సమాధానం చెప్పారు వరుణ్. ఇక లావణ్యకు తనే ముందుగా ప్రపోజ్ చేసినట్లు చెప్పారు. కాగా ఆపరేషన్ వేలంటైన్ తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో వరుణ్-పైలెట్ రుద్రదేవ్‌గా, మానుషీ చిల్లర్-రాడార్ ఆఫీసర్‌గా, నవదీప్- వింగ్ కమాండర్ కబీర్ పాత్రల్లో కనిపించబోతున్నారట.