మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాయి. ఆయన ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పెళ్లెప్పుడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దానికోసం అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే మ్యారేజ్ డేట్‌పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఫైనల్ కాలేదు. తాజాగా దీనిపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు.
మ్యారేజ్ డేట్, ప్లేస్ వంటి అంశాలపై ఆయన ఓపెన్ అయ్యారు. దాదాపు 5 ఏళ్ళ పాటు రహస్యంగా ప్రేమించుకున్న వీరిద్దరూ ఈ ఏడాది జూన్ 9న ఇరు కుటుంబసభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ జరుపుకొని అందరికి వారి ప్రేమ ప్రయాణం గురించి తెలియజేశారు. ఇక వీరిద్దరూ ఎప్పుడు ఏడడుగులు వేయబోతున్నారో అనేది అందరిలో ఉన్న మొదటి ప్రశ్న. ఈ ఏడాది పెళ్లి జరగొచ్చు, లేదు వచ్చే ఏడాదే వరుణ్, లావణ్య మేడలో మూడు ముళ్ళు వేయనున్నాడని అనేక వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తలు పై వరుణ్ కొంచెం క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తాను నటించిన ‘గాండీవధారి అర్జున’ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న వరుణ్ ని పెళ్లి తేదీ గురించి ప్రశ్నించగా.. ఈ సంవత్సరమే పెళ్లి ఉంటుందని వెల్లడించాడు.
అయితే పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదట. ఆ తేదీ విషయం వరుణ్ మదర్, నాగబాబు సతీమణి ‘పద్మజ’ చూసుకుంటున్నారట.పెళ్లి తేదీ విషయంలో ఆమెదే తుది నిర్ణయమని వరుణ్ తెలియజేశాడు. అలాగే పెళ్లి కూడా చాలా సింపుల్ గా చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇక లవ్ విషయంలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. తానే ముందుగా ప్రపోజల్ పెట్టినట్లు వెల్లడించాడు. దానికి లావణ్య కూడా ఓకే అనడం, ఆ తరువాత కుటుంబాలకు తెలియజేయడం వాళ్ళు కూడా ఓకే చేసేయడం జరిగింది. మరి ఈ మెగా జంట ఎప్పుడు ఏడడుగులు వేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.