Operation Valentine Review : వరుణ్ తేజ్ ఆపరేషన్‌ వాలెంటైన్‌ సక్సెస్ అయిందా?

- Advertisement -

Operation Valentine Review : ఇప్పటి వరకు మనం చూసిన సినిమాల్లో దాదాపు యాక్షన్ సీక్వెన్సులు నేలపైనే ఉన్నాయి. కొన్ని చిత్రాల్లో మాత్రం నీటిలోనూ ఫైట్ సీన్స్ చూశాం. కానీ ఆకాశంలో యాక్షన్ అనేది తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నడూ చూడని సరికొత్త అనుభూతి. ఆ అనుభూతిని పంచిన తాజా సినిమా ఆపరేషన్ వాలెంటైన్. టాలీవుడ్ మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది.

మరి ఈ సినిమా ఎలా ఉంది? ఫైటర్ పైలట్ పాత్రలో వరుణ్ నటన ఎలా ఉంది? వరుణ్ ఖాతాలో హిట్ పడినట్టేనా తెలుసుకుందామా? టైటిల్‌: ఆపరేషన్‌ వాలెంటైన్‌నటీనటులు: వరుణ్‌ తేజ్‌, మానుషి చిల్లర్‌, నవదీప్‌, మిర్‌ సర్వర్‌, రుహానీ శర్మ తదితరులునిర్మాతలు: సోనీ పిక్చర్స్‌, సందీప్‌ ముద్దదర్శకత్వం: శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడాసంగీతం: మిక్కీ జే మేయర్‌సినిమాటోగ్రఫీ:హరి కె. వేదాంతంఎడిటర్‌: నవీన్‌ నూలివిడుదల తేది: మార్చి 1, 2024 ఈ మూవీ స్టోరీ ఏంటంటే? అర్జున్‌ రుద్ర దేవ్‌ అలియాస్‌ రుద్ర(వరుణ్‌ తేజ్‌) ఇండియన్ ఎయిర్ ఫోర్స్​లో వింగ్‌ కమాండర్‌గా పని చేస్తుంటాడు.

అక్కడే పని చేసే రాడార్ ఆఫీస‌ర్ అహానా గిల్(మానుషి చిల్ల‌ర్‌)తో ప్రేమలో పడతాడు. అహానా చెప్పినా వినకుండా ఆకాశంలో ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. అలా ఓసారి ఎయిర్​ఫోర్స్ చేపట్టిన వజ్ర అనే ఆపరేషన్​లో తొలిసారి ఫెయిల్ అవుతాడు. అంతే కాకుండా ఆ ఆపరేషన్​లో తన ప్రాణ స్నేహితుడు వింగ్ కమాండర్ కబీర్‌(నవదీప్‌) ప్రాణాలు కోల్పోతాడు. మరోవైపు అర్జున్ తీవ్రంగా గాయపడతాడు. ఈ క్రమంలో ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు ప్రాజెక్ట్‌ వజ్రను బ్యాన్‌ చేస్తారు.

- Advertisement -
varun tej

గాదాన్నుంచి కోలుకుంటున్న క్ర‌మంలోనే మళ్లీ ఆప‌రేష‌న్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆప‌రేష‌న్ వెన‌క ఉన్న క‌థేమిటి? ప్రాజెక్ట్ వ‌జ్ర ల‌క్ష్య‌మేమిటి? చివరకు అది సక్సెస్‌ అయిందా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే: భార‌త్‌, పాకిస్థాన్‌ మ‌ధ్య జ‌రిగిన నిజ‌మైన సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తీసిని సినిమా ఇది. సాధారణంగా భారత్, పాకిస్థాన్​ మధ్య వివాదం గురించి సినిమా అనగానే మనకు ఆర్మీ నేపథ్యంలో ఉండే చిత్రాలే గుర్తొస్తాయి. దేశాన్ని ర‌క్షించ‌డంలో త్రివిధ ద‌ళాల‌దీ కీల‌క‌పాత్ర.

సైనిక, నావిక, వైమానిక ద‌ళాల్లో ఏ ద‌ళం ప్ర‌త్యేక‌త దానిదే. గ‌గ‌న‌త‌లంలో కాప‌లా కాస్తూ, శ‌త్రువుల నుంచి పొంచి ఉన్న ప్ర‌మాదాల్ని ముందే ప‌సిగ‌డుతూ పోరాటం చేసే ఎయిర్ ఫోర్స్​ చూపే తెగువ పెద్దగా వెలుగులోకి రాలేదు. అయితే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ త‌ర్వాత మ‌న వైమానిక ద‌ళం కీర్తి మ‌రింతగా ప్రాచుర్యంలోకి రావడంతో ఆ నేప‌థ్యంలో సినిమాలు చేయ‌డంపై మన చిత్ర పరిశ్రమలు దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల బాలీవుడ్​లో హృతిక్ రోషన్ ఫైటర్ చిత్రాన్ని తీశాడు. ఇప్పుడు వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్​తో వచ్చాడు. ప్రాజెక్ట్ వజ్రతో క‌థ‌ని షురూ చేసిన డైరెక్టర్ ఒక్కొక్క సంఘ‌ట‌న‌ని తెర‌పై ఆవిష్క‌రిస్తూ వెళ్లాడు. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో భావోద్వేగాలు, గ‌గ‌న‌తంలో ఫైట‌ర్ జెట్ల వీర విహారంతో కూడిన విజువ‌ల్స్ ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం, ప్ర‌త్యేక‌మైన ఆక‌ర్ష‌ణ‌.

పుల్వామా దాడిలో సైనికుడు త‌న ప్రాణాన్ని అడ్డు పెట్టి చిన్నారిని కాపాడ‌టం, ఎప్పుడూ వారిస్తూ క‌నిపించే పై అధికారి ‘ఏం జ‌రిగినా చూసుకుందాం’ అంటూ రుద్ర సాహ‌సాల్ని ప్రోత్స‌హించడం, శ‌త్రువుల స్థావ‌రాల్ని ధ్వంసం చేయ‌డం వంటి స‌న్నివేశాలు రోమాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. వ‌జ్ర ప్రాజెక్ట్ ప్ర‌యోగంతో కూడిన క్లైమాక్స్ అదిరిపోయిందనిపిస్తుంది. ఎవ‌రెలా చేశారంటే: నిజ‌మైన ఫైట‌ర్ పైలెట్‌లా వ‌రుణ్‌తేజ్ తన పాత్రలో జీవించాడు. ఎమోషనల్ సీన్స్​లోనూ ఈసారి తన హవా చూపించాడు. మానుషి చిల్ల‌ర్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది.

దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెర‌పై క‌నిపిస్తారు. అయితే వీళ్ల లవ్ స్టోరీ మాత్రం అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా విజువ‌ల్స్, గగనతలంలో యాక్షన్ విజువల్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆక‌ట్టుకుంటాయి. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం వినసొంపుగా ఉంది. ద‌ర్శ‌కుడు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ హ‌డా వైమానిక ద‌ళం, ఆప‌రేష‌న్లు, వాళ్ల ధైర్య సాహ‌సాల్ని సహ‌జంగా తెర‌పై చూపించారు కానీ, క‌థ‌లో కాస్త డ్రామానే కొర‌వ‌డినట్లు అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ + దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే స‌న్నివేశాలు + వ‌రుణ్‌తేజ్, మానుషి చిల్ల‌ర్‌ + విజువ‌ల్స్ మైనస్ పాయింట్స్ – క‌థ‌నం – ఎమోషన్స్ అంతగా పండకపోవడం రేటింగ్ : 3/5 కన్​క్లూజన్ : వరుణ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ సక్సెస్ అయినట్టే!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here