Varuntej : పెళ్లి అయి ఏడాది కాకముందే.. ఆ ఆపరేషన్ చేయించుకోబోతున్న వరుణ్ తేజ్

- Advertisement -

Varuntej : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలికీ ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కుటుంబానికి చెందిన హీరోలే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ ఫ్యామిలీకి సంబంధించిన పలు వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ హీరోల మీదే కాకుండా ఆ కుటుంబానికి చెందిన కోడళ్లు, కూతుర్లపై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. కానీ వాటిని అభిమానులు కొట్టిపారేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మెగా హీరో వరుణ్ తేజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అసలేం మేటర్ ఏంటంటే.. ఇటీవల లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ ప్రేమించి ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేసినప్పటికీ హిట్ అందుకోలేక పోతున్నాడు. ఇక లావణ్య విషయానికొస్తే.. పెళ్లి తర్వాత ఓ వెబ్ సిరీస్ తప్ప మరో కొత్త సినిమా ఒప్పుకోలేదు.

varun lav
varun lav

ప్రస్తుతం వీరిద్దరూ వెకేషన్స్‌కు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే అక్కడ వారు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. అయితే అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో.. వరుణ్ ఓ ఆపరేషన్ చేయించుకోబోతున్నాడంటూ సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. వరుణ్ తేజ్ కాలికి చిన్న గాయం కావడంతో అది కాస్త పెరిగి పెద్దగా అయిందట.. ఇప్పటికే ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేయాలని సూచించారట. దీంతో వరుణ్ ఆ ఆపరేషన్ చేయించబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన కొందరు గుడ్ న్యూస్ చెబుతారనుకుంటే.. పెళ్లై ఏడాది కాకముందే అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్నాడా వరుణ్ ? అంటూ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అలాగే ఇంకొందరు మాత్రం అయ్యో ఎంత కష్టం వచ్చిందే అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ మెగా అభిమానులు మాత్రం ఇందులో నిజం ఎంత ఉందో తెలియకుండా ఏదేదో అనుకోవడమేనా? అని గట్టిగా విమర్శిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here