Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వరుణ్ తేజ్, తన తోటి నటి లావణ్యను ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 09న కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. నవంబర్ 01న వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. ఈ జంట దాదాపుగా ఆరేళ్ల పాటు ప్రేమించుకుని.. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది. వరుణ్ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున తర్వాత లేటెస్ట్‌గా ఆపరేషన్ వాలైంటెన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా మార్చి 1వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో రానుంది. ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్.. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో సందడి చేశారు. ఇక ఈ సందర్భంగా స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని స్టూండెట్స్ అడగ్గా వరుణ్ స్పందిస్తూ నా ఫేవరెట్ హీరోయిన్‌ను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, తను ఇంట్లో ఉందంటూ, నేనే మొదట తనకు ప్రపోజ్ చేశానని.. నవ్వుతూ సమాధానం ఇచ్చారు వరుణ్ తేజ్. ఇక లావణ్య త్రిపాఠి కాకుండా ఇష్టమైన హీరోయిన్ ఎవరని మరో ప్రశ్న సంధించగా.. తన భార్య కాకుండా సాయి పల్లవి తన ఫేవరేట్ హీరోయిన్ అంటూ సమాధానం ఇచ్చారు.

వరుణ్ ఇటీవల ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్.. పలాస ఫేమ్ కరుణ కుమార్‌తో మరో చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాకు మట్కా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది. విశాఖపట్నం నేపథ్యంలో 1960లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా వస్తోందట. ఇటీవలే చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను జరుపుకుంది.