Varun Tej ఇటీవల కాలంలో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న సినిమా “ఆపరేషన్ వాలంటైన్”. పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వరుణ్ తేజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కి్స్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో ఆయనకు ఈ సినిమా పాపులారిటీ తీసుకొస్తుందని ఆయన అభిమానులు చాలా ధీమాగా ఉన్నారు. పెళ్లి తర్వాత ఫస్ట్ రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా పెట్టుకుని ఉన్నారు ప్రేక్షకులు.

ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ విలేకర్ల సమావేశంలో పాల్గొన్నాడు. అదే మూమెంట్లో రిపోర్టర్స్ పవన్ కళ్యాణ్ సినిమాలో మీరు విలన్ పాత్ర పోషించే ఛాన్సెస్ ఉన్నాయా ..? అంటూ ప్రశ్నించారు . దీనికి వరుణ్ తేజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అలా చేస్తే నన్ను చంపేస్తారంటూ ఓపెన్ గా ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు.

నిజమే ఒక మెగా హీరో సినిమాలో మరొక మెగా హీరో విలన్ గా నటిస్తే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండంటూ మెగా అభిమానులు వరుణ్ తేజ్ మెగా ఫ్యాన్స్ వరుణ్ సమాధానాన్ని స్వీకరిస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వరుణ్ తేజ్. పెళ్లి తర్వాత ఓ పక్క ఫ్యామిలీ లైఫ్ ను మరొక పక్క ప్రొఫెషనల్ లైఫ్ ను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాడు.