Varun – Lavanya : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఆయన సతీమణి & హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎక్కడ ఉన్నారో తెలుసా? హనీమూన్ టూర్లో! అవును… ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇండియాలో లేరు. విదేశాల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లారు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే…కొత్తగా పెళ్ళైన స్టార్ కపుల్ వరుణ్ & లావణ్య ప్రజెంట్ ఫిన్ ల్యాండ్ లో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఫిన్ ల్యాండ్ నుంచి మరొక ప్రదేశానికి కూడా వెళతారని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది.
ఓ వారం లేదా 10 రోజుల పాటు టూర్ ఉండొచ్చని కొత్తగా పెళ్ళైన స్టార్ కపుల్ వరుణ్ & లావణ్య ప్రజెంట్ ఫిన్ ల్యాండ్ లో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఫిన్ ల్యాండ్ నుంచి మరొక ప్రదేశానికి కూడా వెళతారని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. ఓ వారం లేదా 10 రోజుల పాటు టూర్ ఉండొచ్చట. ఫిన్ ల్యాండ్ అంటే మెగా ఫ్యామిలీకి ఇష్టం అనుకుంట! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొన్నాళ్ల క్రితం ఆ మంచు ప్రదేశానికి వెళ్లారు. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య దంపతులు సైతం అక్కడికి వెళ్లారు. ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఏడు అడుగులు వేశారు.
పెళ్లి విదేశాల్లో జరిగినప్పటికీ… త్వరగా ఇండియా వచ్చేశారు. పెళ్లి జరిగిన మూడు రోజులకు కొత్త జంట హైదరాబాద్ సిటీలో అడుగు పెట్టింది. ఇక్కడ రిసెప్షన్ జరిగింది. ఆ తర్వాత డెహ్రాడూన్లోని అత్తారింటికి వరుణ్ తేజ్ వెళ్లారు. లావణ్య త్రిపాఠి బంధు మిత్రుల కోసం అక్కడ మరో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అన్ని పనులు పూర్తి కావడంతో కాస్త వెసులుబాటు చేసుకుని ఇప్పుడు హనీమూన్ టూర్ వేశారు.