హ్యాపీడేస్, కొత్త బంగారులోకం వంటి సినిమాలో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. కాస్త సినిమాలకు గాప్ ఇచ్చారు. మళ్లీ ఈ మధ్య కాలంలోనే ది కానిస్టేబుల్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్‌లో వరుణ్ సందేశ్‌కు గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ సమయంలో హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. దీంతో డాక్టర్లు వరుణ్ ని మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. వరుణ్ అకస్మాత్తుగా గాయపడడంతో ది కానిస్టేబుల్ సినిమా షూటింగ్ అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ అన్నారు.
కొన్నాళ్ల క్రితం వరకు అవకాశాల్లేక సినిమాలకి దూరంగా ఉంటున్నాడు వరుణ్ సందేశ్.. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక కాస్తంత బిజీ అయ్యాడు. వరస ప్రాజెక్ట్స్ తో షూటింగ్స్ చేస్తున్నాడు. బుల్లితెర షోస్ లోను తరచూ భార్య వితికాతో కలిసి కనిపించి కనువిందు చేస్తున్నాడు. ది కానిస్టేబుల్ సినిమా పూర్తిగా పల్లెటూరి వాతావరణం లో నిర్మాణం అవుతుంది. ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని 40శాతం షూటింగ్ పూర్తి చేసుకుని.. రెండవ షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ తెలిపారు.