Varsha : పెళ్లికాకుండానే తల్లి కాబోతున్న జబర్దస్త్ వర్ష.. అంత తొందరెందుకమ్మ అంటున్న నెటిజన్స్

- Advertisement -

Varsha : జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది పేరు తెచ్చుకుని పాపులర్ అయ్యారు. ఈ షోలో చేసిన చాలా మంది కమెడియన్స్ ప్రస్తుతం వెండితెర పై సత్తా చాటుతున్నారు. హీరోలుగా, కమెడీయన్లుగా, డైరెక్టర్లుగా ఇలా చాలా మంది నటీనటుల్ని సినిమాలో నటించే ఛాన్స్ వచ్చేంత ఫేమస్ చేసింది జబర్దస్త్. అలా ఫేమస్ అయిన వారిలో లేడీ కమెడీయన్ వర్ష కూడా ఒకరు. ఈ షో ద్వారా ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈమె ఇమ్మానుయేల్ కు జోడీగా చేసి ప్రేక్షకులకు చాలా దగ్గర అయింది.

 

- Advertisement -

 

ఇదిలా ఉండగా ఎక్స్ ట్రా జబర్దస్త్ తాజా ఎపిసోడ్ లో లేడీ కమెడియన్ శ్రీ విద్య చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట్లో రచ్చ సృష్టిస్తున్నాయి. అందులో భాగంగా స్కిట్ లో శ్రీవిద్య, ఇమ్మానుయేల్ ముందుగా స్టేజ్ పైకి వస్తారు. తాను ఓ జ్యువెల్లరీ షాపు యజమానిగా ఇమ్మానుయేల్.. అందులో పని చేసే అమ్మాయిగా శ్రీవిద్య ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అయితే తమ షాపు అందరికీ తెలిసి బాగా పాపులర్ కావడానికి ఏదైనా ప్లాన్ చెప్పమని అనగానే శ్రీవిద్య జబర్దస్త్ నటులను తీసుకు వస్తే బాగా యూజ్ అవుతుందని సలహా ఇస్తుంది. అలా సెలబ్రిటీలుగా వర్ష, బాబులు వేదిక పైకి ఇస్తారు.

ఈ క్రమంలోనే వారిద్దరూ మాట్లాడుతున్న క్రమంలో ముందుగా సెల్ఫీ అడిగిన ఇమ్మానుయేల్ తో బాబు నువ్వేంట్రా ఇలా ఉన్నావు. నీ మొహమేంటంటూ కామెంట్ చేస్తారు. ఆ తర్వాత వారిద్దరినీ కుర్చీల్లో కూర్చోబెడతారు. అంతలోనే బాబు వేడి ఎక్కువగా ఉంది అక్కడ ఏసీ పెట్టించలేదని.. కుష్బూ, క్రిష్ణ భగవాన్, రష్మిలా తాను ఎక్కడ పడితే అక్కడ కూర్చోనంటూ కామెంట్ చేస్తాడు. అయితే అప్పటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న వర్షం మాత్రం మెల్లిగా శ్రీవిద్యను పిలిచి.. వాటర్ మిలన్ జ్యూస్ లో అలా నిమ్మరసం కలిపి తీసుకు రావా అని చెప్పుతుంది.. ఏంటి మేడం మీరు కడుపుతో ఉన్నారా అంటూ వర్షను అడుగుతుంది. ఆమె అలా అనగానే అక్కడున్న వాళ్లంతా నవ్వుతారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here