Vantalakka Deepa : కార్తీక దీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంటలక్కగా బాగా ఫేమస్. స్టార్ హీరోయిన్స్ కూడా ఈమె క్రేజీ ముందు దిగదుడుపే. టీవీల్లో ఎన్ని తోపు లాంటి సినిమాలొచ్చినా.. కార్తీక దీపం రేటింగ్ ముందు నిలవలేకపోయాయి. ఆ మధ్య కార్తీక దీపం సీరియల్‌ను ఎండ్ చేశారు. తెలుగు టీవీతెరపై ఉన్న వంటలక్క క్రేజ్ వేరు ఒకప్పుడు. కార్తీక దీపంలో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. చేసింది ఒకే ఒక్క సీరియల్ అయినా మిగిలిన ఏ సీరియల్ నటీనటులు ఆమెను బీట్ చేయలేకపోయారు.
ఇక ఈ సీరియల్ ఆరేళ్ల తర్వాత ఆగిపోయింది. దీంతో అసలు ఈ సీరియల్లో నటించిన ప్రేమీ విశ్వనాథ్ కనిపించకుండా పోయింది. అసలు ఏమి చేస్తుంది.. ప్రస్తుతం ఎలా ఉందో అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ తర్వాత తన సొంతూరైన ఏర్నాకుళం వెళ్లారు. అక్కడే తన స్టూడియో బాధ్యల్నీచూసుకుంటున్నారు. ఆమెకు అక్కడ రెండు స్టూడియోలు ఉన్నాయట. అంతేకాదు అడపాదడపా ఆమె కొన్ని తెలుగు సినిమాల్లోను, కొన్ని యాడ్స్‌లోను నటిస్తున్నారు.
ఇక ఆమె భర్త విషయానికి వస్తే.. కేరళలో పేర్గాంచిన జోతిష్యుడైన డా. టి.ఎస్. వినీత్ భట్‌తో ఆమె పెళ్లి జరిగింది. వీరిది ప్రేమి వివాహం. ప్రేమీ నటన విషయానికి వస్తే.. మోడలింగ్ రంగంలో గుర్తింపు సాధించిన ప్రేమి, 2013లో ఏసియానెట్ మలయాళం టెలివిజన్‌లో వచ్చిన కరతముత్తు అనే సీరియల్‌తో టీవిరంగంలోకి ప్రవేశించింది. ఆ సీరియల్ మలయాళ టీవీరంగంలో సంచలనాన్ని సృష్టించింది. అంతేకాదు ఈ సీరియల్లో ప్రేమి నటనకి మంచిపేరు వచ్చింది.
తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ‘‘కెరీర్ కోసం నా పిల్లల్ని వదిలి నేను తెలుగు పరిశ్రమకు వచ్చాను. నా భర్త దగ్గర అస్సలు ఉండనని తెలిపింది. అప్పుడు మీ హస్బెండ్ కి కోపం రాదా అని యాంకర్ ప్రశ్నించగా.. నేను నిజం చెప్పాలంటే.. నేను కేరళలో ఉన్నప్పుడు తాను కేరళలో ఉండడు. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు తను హైదరాబాద్ లో ఉండడు. నేను ఒక రాష్ట్రంలో ఉంటే ఆయన ఒక స్టేట్‌లో ఉంటాడు. నా భర్త నా కన్నా బిజీగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి కలుస్తామంతే. అంటూ ప్రేమీ విశ్వనాథ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వంటలక్క కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.