Vani Bhojan : సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కించుకున్న అందాల భామ వాణీ భోజన్. బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తుంది. హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన.. వాణి భోజన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. మీకు మాత్రమే చెప్తా మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది వాణీ భోజన్. కానీ ఆ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. సూపర్ హిట్స్ అయితే ఏమీ వాణీ భోజన్ ఖాతాలో లేవు కానీ.. ప్రస్తుతం మాత్రం బిజీ హీరోయిన్ గా ఉంది.
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వాణీ భోజన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎదురవుతున్న వేధింపుల గురించి తెల్సిందే. ఏం చెప్పినా చేయాల్సిందే నని కొందరు బలవంతం చేస్తారు. మనీ, ఛాన్సుల పేరుతో లోబరుచుకునే ప్రయత్నాలు జరుగుతాయి. వాణీ భోజన్ కు కూడా ఇలాంటి ఛేదు అనుభవమే ఎదురైందంట.
తాను నటించడానికి అంగీకరించిన ఒక మూవీలో అనవసరంగా ఒక సీన్ క్రియేట్ చేశారంట. కథకు ఆ సన్నివేశానికి ఎలాంటి సంబంధం లేదు. అది బెడ్ రూమ్ లో సాగే రొమాంటిక్ సీన్ అంట అది. కాగా ఆమూవీలో బెడ్రూం సీన్ ఉన్నట్లు ముందుగానే ఆమెకు చెప్పలేదంట. సెట్స్ లో అప్పటికప్పుడే ఆ సీన్ లో యాక్ట్ చేయాలని అడిగారంట. యాక్ట్ చేయనని చెపితే ఫోర్స్ చేశారంట. దీనితో తనకు కోపం వచ్చిందని ఆ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంది వాణీ భోజన్.
బోల్డ్ సీన్ లో నటించే ప్రసక్తే లేదని తెల్చిచెప్పిందంట. డబ్బు కోసం దిగజారనని.. డబ్బు అవసరం లేదని షాకిచ్చిందంట. దీనిపై వాణీ భోజన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె చేసిన పనిని అభినందిస్తూ చాలా మందికి వాణీ భోజన్ కు మద్దతు తెలుపుతున్నారు. గ్లామర్ గా కనిపించేందుకు సిద్ధమే అని.. కానీ స్టోరీ కి సంబంధం లేని విధంగా రొమాంటిక్ సీన్లలో నటించనని తెల్చిచెప్తోంది ఈ బ్యూటీ.