Collections : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం మూడు రోజుల్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసింది. కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని దాటాలంటే ఈ స్పీడ్ సరిపోదు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టాలి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అది అసాధ్యం అని అనిపిస్తుంది. ఈరోజు క్రిమస్ కాబట్టి ఈరోజు వసూళ్లు బాగానే ఉంటాయి. కానీ రేపటి నుండి ఈ చిత్రం ఎంతమేరకు వసూళ్లను రాబట్టబోతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అడ్వాన్స్ బుకింగ్స్ రేపటికి దారుణంగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే నైజాం మరియు సీడెడ్ మినహా, ఏపీ మార్కెట్ లో ఈ చిత్రానికి కాంబినేషన్ కి తగ్గ వసూళ్లు మాత్రం రావడం లేదు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమా ‘వకీల్ సాబ్’ రేంజ్ లోనే వసూళ్లను రాబడుతుంది. రెండవ రోజు ఉత్తరాంధ్ర లో వకీల్ సాబ్ చిత్రానికి ఎలాంటి GST లేకుండా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, కానీ సలార్ చిత్రానికి నాలుగు కోట్ల కంటే తక్కువ షేర్ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మూడవ రోజు కూడా అదే పరిస్థితి. మంచి వసూళ్లు వస్తున్నాయి కానీ, అది బ్రేక్ ఈవెన్ కి ఏమాత్రం సరిపోదు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆ రేంజ్ పాజిటివ్ టాక్, అద్భుతమైన రేటింగ్స్ ఉన్నా కూడా ఈ సినిమా లాస్ వెంచర్ గా మిగలబోతుందా అని ట్రేడ్ పండితులు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి.