Vaishnavi Chaitanya : బ్లాక్ బస్టరైనా ‘బేబీ’కి కలిసి రాని టైం.. చివరకు ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పిన వైష్ణవి చైతన్య

- Advertisement -


Vaishnavi Chaitanya ప్రస్తుతం ఈ పేరును పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సంపాదించుకుంది. యూట్యూబ్ ద్వారా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈమె యూట్యూబ్ ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ క్రేజ్ దక్కించుకున్న వైష్ణవి చైతన్య ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Vaishnavi Chaitanya
Vaishnavi Chaitanya

ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు తిరుగులేదని ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చేస్తాయని అంతా అనుకున్నారు.. కానీ ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఇటీవల స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఓకే చెప్పిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయబోతుందని టాక్.

Ram Pothineni

మొదటగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుకున్నారట. కానీ ఫైనల్లీ ఐటమ్ గర్ల్ గా చూస్ చేసుకున్నారట . ఈ ఆఫర్ ని కూడా బేబీ డైరెక్టర్ సాయి దగ్గర ఉండి మరి ఆమె చేత ఒప్పించి.. సైన్ చేయించాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇండస్ట్రీలోకి ఏదో అయిపోతానని వచ్చి.. ఆఖరికి ఐటెమ్ సాంగ్స్ చేసుకునే స్థాయికి దిగజారిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here