Poonam Pandey : నటి పూనమ్ పాండే తాను చనిపోయాను అంటూ ప్రచారం చేసి ఎంత షాక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్వికల్ క్యాన్సర్ పై అవగాహన పెంచడానికే ఈ విధంగా చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాను చనిపోయానని తన మేనేజర్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయించిన పూనం పాండే, ఆమె చెప్పగానే అందులో పోస్ట్ చేసిన మేనేజర్, ఈ ఇద్దరి మీద కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫేక్ న్యూస్ నమ్మి ఆమె మరణానికి నివాళులు అర్పించిన వారందరి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆమె మరోసారి ఇలాంటి పనులు చేయకుండా ఆమె మీద, ఆమె మేనేజర్ మీద కేసు నమోదు చేసి సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా మరో హాట్ బ్యూటీ.. పూనమ్ పై సెటైర్ వేస్తూ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వింత ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆమెనే. ఇక తాజాగా ఉర్ఫీ బెడ్ పై పడుకున్న ఫోటోను షేర్ చేస్తూ .. ‘‘హాయ్ అబ్బాయిలు నేను చనిపోలేదు. హ్యాంగోవర్ గురించి అవగాహన కల్పిస్తున్నాను. మద్యపానం చేస్తున్నప్పుడు మొదటి రోజు మీరు బతుకున్నట్లు అనిపిస్తారు. ఎలాంటి అసౌకర్యానికి గురి కారు. కానీ, ఆ తరువాత రోజు మాత్రం మీరు చనిపోయినట్లుగానే కనిపిస్తారు. కానీ నిజంగా చనిపోరు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.