Upasana : అరుదైన ఘనత సాధించిన ఉపాసన.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్

- Advertisement -

Upasana : గ్లోబల్‌స్టార్‌ హీరో రాంచరణ్‌ సతీమణి కొణిదెల ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అపోలో ఆస్పత్రుల యాజమాన్యంలో ఒకరిగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఉపాసన జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యతను నిర్వహించనున్నారు. అపోలో హాస్పిటల్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వింగ్‌కు నేతృత్వం వహిస్తున్న ఆమె వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ భారత శాఖకు జాతీయ రేంజర్ కమ్ అంబాసిడర్ గా ఉపాసన నియమితులయ్యారు. అపోలో హాస్పిటల్స్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ మధ్య ఎంవోయూ కుదిరింది. దీంతో నాలుగేళ్ల పాటు ఉపాసన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్‌ డీఎఫ్‌వో రోహిత్‌ గోపిడి శుక్రవారం ప్రకటనలో తెలిపారు.

Upasana Baby Bump

‘అటవీ అధికారులు ఉపేక్ష యోధుల లాంటి వారు, వారు జంతువులు, మానవుల భద్రతకు భరోసా ఇస్తున్నారు’ అంటూ ఉపాసన ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. అపోలో హాస్పిటల్స్‌లో అటవీ అధికారులు, స్థానిక వన్యప్రాణి సంరక్షణ కమిటీ సభ్యులకు ఏ సందర్బంలోనైనా గాయపడితే నాణ్యమైన వైద్యం అందించడానికి తాను కృషి చేస్తానన్నారు. ‘మానవ వన్యప్రాణుల సంఘర్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి నా ప్రయత్నం ఈ సహకారంతో బలపడుతుంది. ప్రకృతిని గౌరవించండి, ప్రతిఫలంగా అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది’ అని ఉపాసన కొణిదెల ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. పలు సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.

- Advertisement -

ఉపాసన తరచూ సమాజానికి ఉపయోగపడే పలు సందేశాలను కూడా సోషల్ మీడియా వేదికగా ఇస్తుంటారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇటీవల కుమార్తెకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు క్లీంకార అని నామకరణం చేశారు.ఆమె వచ్చిన నాటి నుంచి తమ నివాసంలో అనేక మంచి విషయాలు జరుగుతున్నాయని మెగా కుటుంబం పట్టలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here