Unstoppable Season 3 : ‘అన్ స్టాపబుల్’ సీజన్ 3 ప్రారంభం తేదీ వచ్చేసింది..మొదటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథి ఎవరంటే!

- Advertisement -

Unstoppable Season 3 నందమూరి బాలకృష్ణ ని నేటి తరం యువత కి బాగా దగ్గర అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో. ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అయిన ఈ టాక్ షో కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ కూడా ఈ టాక్ షో లో పాల్గొని తమ విలువైన సమయాన్ని కేటాయించారు. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి అవ్వగా, ఈ రెండు కూడా ఒక దానిని మించి ఒకటి బంపర్ హిట్ అయ్యాయి. ఈ టాక్ షో కి డైరెక్టర్ గా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ వ్యవహరించాడు. ఇప్పుడు బాలయ్య బాబు కొడుకు మొదటి సినిమాకి కూడా అతనే దర్శకత్వం వహించబోతున్నాడు.

Unstoppable Season 3
Unstoppable Season 3

అయితే ఈ టాక్ షో దసరా సీజన్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. బాలకృష్ణ ఈ షో ద్వారా టాలీవుడ్ లో ఉండే టాప్ హీరోలను, యంగ్ హీరోలను ఇంటర్వ్యూ చేసాడు కానీ , తన జనరేషన్ లో, తనతో సమానంగా పోటీ పడిన చిరంజీవి, నాగార్జున మరియు వెంకటేష్ ని మాత్రం ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చెయ్యలేదు. ఈ సీజన్ లో వారిని కవర్ చేయబోతున్నారట. మొదటి ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ జనరేషన్ స్టార్స్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మిస్ అయ్యారు. వీరిలో చివరి ఎపిసోడ్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయించే ఆలోచనలో ఉన్నారట ఆహా మీడియా టీం.

Unstoppable with NBK Season 3 on OTT: Bhagavanth Kesari star Nandamuri Balakrishna returns as a talk

- Advertisement -

ఇలా ఈ సీజన్ మొత్తం సెన్సేషనల్ గా ఉండబోతుందని టాక్. అంతే కాకుండా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రొమోషన్స్ నిమిత్తం వాళ్ళు కూడా ఈ టాక్ షో లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే బాలయ్య ప్రస్తుతం డైరెక్టర్ బాబీ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన అఖండ 2 ప్రారంభించబోతున్నాడు. ఇందుకు సంబంధించి రీసెంట్ గానే 14 రీల్స్ నిర్మాతలు బాలయ్య తో భేటీ కూడా అయ్యారట. అలాగే మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ఫాహద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రాన్ని తెలుగు లో బాలయ్య బాబు రీమేక్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Exclusive: NBK's Unstoppable Season 3 for Dasara

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here