Nandamuri Family : నందమూరి తారక రామారావు సినీ, రాజకీయ పరంగా ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించారు.. నందమూరి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నందమూరి కుటుంబ సభ్యులు కొంతమంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే.. మరి కొంతమంది అదృష్టవశాత్తు బ్రతికి బయటపడుతున్నారు.. మరి కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు.. నందమూరి కుటుంబానికి ఏమైంది.. వారి కుటుంబంలో ఇన్ని ఆత్మహత్యలు, అసహజ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి.. వీరి కుటుంబానికి ఏమైనా శాపం తగిలిందా? అని అభిమానులు అంటున్నారు.. ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన ఒక 6 సంఘటనలే అందుకు నిదర్శనం.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నందమూరి కుటుంబాన్ని ప్రమాదాలు వీడడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీకి ప్రచారం చేస్తూ మొదటిసారి ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదం నుంచి జూనియర్ ఎన్టీఆర్ బయటపడ్డారు. ఆయన హాస్పటల్లో ఉన్న సమయంలోనే.. నందమూరి తారక రామారావు కుమారుడైన రామకృష్ణ కూడా ప్రమాదానికి గురయ్యారు.
నందమూరి కుటుంబంలో నాలుగు సంవత్సరాల కాలంలో రెండు మరణాలు సంభవించాయి. అవి కూడా కేవలం ప్రమాదాల వలన జరగడం విశేషం. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడైన జానకిరామ్ కార్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఆ తరువాత హరికృష్ణ సైతం ఒక ప్రమాదంలో అక్కడికక్కడే కన్నుమూశారు. నందమూరి తారకరామారావు మనవరాలు కుముదిని పెళ్లయ్యాక మానసిక సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకొని మరణించింది.

ఆ తరువాత ఎన్టీఆర్ చిన్న కూతురు మా మహేశ్వరి గత ఏడాది మానసిక సమస్యలతో ఉరి వేసుకుని తనువు చాలించింది.. ఇక నందమూరి మొదటి కుమారుడు రామకృష్ణ చిన్న వయసులోనే మసూచి వ్యాధితో కన్నుమూశారు. ఆయన మరణం నుంచి కోలుకోవడానికి ఎన్టీఆర్ కి చాలా సమయం పట్టింది. ఇప్పుడు తారకరత్న ఇలా చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మరణించడం అభిమానులతో పాటు కుటుంబాన్ని కూడా ఎంతో మానసిక వేదనకు గురిచేసింది. ఇలా వరుస మరణాలు సంభవించడం మాత్రమే కాదు.. చాలా సహజంగా వీరి మరణాలు జరగడమే అభిమానులకు కలవరాన్ని గురిచేస్తుంది.