అల్లరి నరేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉగ్రం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై యావరేజి టాక్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ చేసిన కొన్ని చిన్న పొరపాట్లు వల్ల ఈ చిత్రానికి యావరేజి టాక్ వచ్చిందని, స్టోరీ లైన్ బాగున్నప్పటికీ సినిమాలో అనవసరమైన ఎమోషనల్ సీన్స్ ఎక్కువ పెట్టడం వల్ల సగటు ఆడియన్స్ కి థ్రిల్లర్ ని చూస్తున్నాము అనే అనుభూతి పోయిందని, ఫలితంగా యావరేజి తో సరిపెట్టుకుని పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు చెప్తున్నమాట.

కానీ అల్లరి నరేష్ నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇది వరకు ఆయన ప్రేక్షకులకు తనలో దాగున్న ఎన్నో కోణాలను చూపించాడు, ఈ చిత్రం తో తనలో ఒక మాస్ హీరో కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు.ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
టీజర్ మరియు ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడం ప్రారంభం షోస్ కి మంచి ఆక్యుపెన్సీలు వచ్చాయి, కానీ ఆ తర్వాతి షోస్ నుండి వసూళ్లు తగ్గిపోతూ వచ్చింది.సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు వసూళ్లు తగ్గుతున్నాయి అనేది ట్రేడ్ పండితులకు సైతం అంతు చిక్కలేదు.

మొత్తం మీద మొదటి రోజు అన్నీ ప్రాంతాలకు కలిపి కోటి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 6 కోట్ల 20 లక్షల రూపాయలకు జరిగింది. మొదటి వీకెండ్ లో నాలుగు కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చే అవకాశం ఉంది, వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టిన బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేస్తుందని అంటున్నారు, మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.