‘తురుమ్ ఖాన్లు’ మూవీ ఫుల్ రివ్యూ..కొత్తవాళ్లతో ఇదేమి రచ్చ సామీ!

- Advertisement -

నటీనటులు : శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశ్వర్య ఉల్లింగల , పులి సీత, విజయ పలాస, శ్రియాంక తదితరులు

ఎడిటర్ : నాగేశ్వర రావు బొంతల
ఫోటోగ్రఫీ : చరణ్ అంబటి
మ్యూజిక్ : వినోద్ యాజమాన్య
సహా నిర్మాత : కొత్త కళ్యాణ్ రావు
నిర్మాత : యాసిఫ్ జానీ
రచన- దర్శకత్వం – శివ కళ్యాణ్

ఈ ఏడాది పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాల హవానే ఎక్కువ కనిపించింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారీ అంచనాలతో విడుదలైన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చినన్ సినిమాలు మాత్రం దుమ్ము లేపేసున్నాయి. అందుకే ఆడియన్స్ చిన్న సినిమాలకు సంబంధించిన టీజర్ , ట్రైలర్ ఆకట్టుకుంటే వెంటనే థియేటర్స్ కి క్యూ కట్టేస్తున్నారు. అలా టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకున్న రీసెంట్ చిన్న సినిమాలలో ఒకటి ‘తురుమ్ ఖాన్లు’. హీరో హీరోయిన్ మరియు క్యారక్టర్ ఆర్టిస్ట్స్ దగ్గర నుండి టెక్నిషియన్స్ వరకు మొత్తం కొత్తవాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో ఈ రివ్యూ లో చూద్దాం.

- Advertisement -

`

కథ :

తుపాకుల గూడెం అనే ఒక విచిత్రమైన ఊరులో ఎల్లప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఒకరు సక్సెస్ అయితే చూసి ఓర్వలేని జనాలు ఎక్కువగా ఉంటారు. అలాంటి ఊర్లో బ్రహ్మం, విష్ణు మరియు శంకర్ అనే ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే కథ ఇది. పొలిటికల్ నేపథ్యం ఉన్న శంకర్ రెండు రోజుల్లో తన మరదలు ని పెళ్లి చేసుకోబోతుంటాడు. సరిగ్గా ఆ సమయం లోనే కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ పడుతుంది. ఆ సమయం లో పెళ్లిళ్లు చేసుకోవచ్చు కానీ, 40 మందికి మించి ఉండకూడదు. శంకర్ ఆ నియమాలకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళ ఒత్తిడి కారణంగా బంధువులను ఎక్కువగా పిలవాల్సి ఉంటుంది. సరిగ్గా ఆ సమయం లోనే బ్రహ్మం ఎంట్రీ ఇస్తాడు. 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదనే ఫ్రస్ట్రేషన్ లో ఉంటుంటాడు బ్రహ్మం. దీంతో ఊర్లో ఎవరికీ పెళ్లి జరిగిన ఓర్వలేక రగిలిపోతూ ఉంటాడు. అలా తన కళ్ళముందే శంకర్ కి పెళ్లి జరగడాన్ని జీర్ణించుకోలేక పోలీసులకు ఫోన్ చేసి నియమాలను అతిక్రమించి పెళ్లి చేసుకుంటున్నారు అని సమాచారం అందిస్తాడు. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి శంకర్ పెళ్లిని ఆపేస్తారు. ఈ పెళ్లి ఆగిపోవడానికి బ్రహ్మం కారణమని తెలుసుకున్న శంకర్ ఎలా అయినా అతడి మీద పగ తీర్చుకోవాలి అనే కసితో ఉంటాడు.

మరోవైపు విష్ణు తన ప్రేయసి పద్మ తనకి తెలియకుండా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుందని అపార్థం చేసుకొని ఆమెని దూరం పెడుతూ ఉంటాడు. పద్మ విష్ణు కి ఎంత నచ్చచెప్పాలని చూసినా విష్ణు అర్థం చేసుకోడు, దీంతో పద్మ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విష్ణు కి ఎక్కడో తప్పు చేస్తున్నానే అనే ఫీలింగ్ మనసులో బలంగా పడింది. పద్మ ని తల్చుకుంటూ బాధతో రగిలిపోతూ ఉంటాడు. ఎలా అయినా ఆమెని కలవాలి అనే ఉద్దేశ్యం తో ఆమె చదువుతున్న కాలేజీ కి వెళ్లగా, ఆ కాలేజీ కరోనా లాక్ డౌన్ కారణంగా మూసేస్తారు. ఇక నేరుగా ఆమె ఉంటున్న ఊరుకి బయలుదేరుతాడు. కరోనా కారణంగా బయట ఊరి వాళ్ళు లోపలకు ఎంట్రీ లేదని ఆ ఊర్లో చెప్తారు. ఇక చేసేదేమి లేక విష్ణు వెనక్కి వచ్చేస్తాడు. మరి చివరికి విష్ణు పద్మ ని ఎలా కాంటాక్ట్ అయ్యాడు , వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారా..?, బ్రహ్మం కి పెళ్లి అవుతుందా..?, శంకర్ అతనిని దెబ్బ తియ్యడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు..?,శంకర్ చివరికి తన మరదలు ని పెళ్లి చేసుకున్నాడా లేదా ఇలాంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

లాక్ డౌన్ నేపథ్యం ని తీసుకొని గత లో చాలా సినిమాలు వచ్చాయి, అవన్నీ ప్రేక్షకాదరణ పొందాయి కూడా. ఈ సినిమా కూడా లాక్ డౌన్ నేపథ్యం లో వచ్చిందే, ఈ చిత్రం లో ఎదురయ్యే ప్రతీ సమస్య లాక్ డౌన్ కారణంగా గానే వచ్చింది. డైరెక్టర్ శివ కళ్యాణ్ ఆ అంశాన్ని పాయింట్ గా తీసుకొని చాలా చక్కని స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను అలరించాడు అనే చెప్పాలి. లాక్ డౌన్ కారణంగా ఎదురయ్యే పరిణామాలు ప్రేక్షకులకు నవ్వు రప్పిస్తాయి. అలాగే ఎమోషన్స్ ని కూడా చాలా చక్కగా పలికేలా చేసాడు డైరెక్టర్ శివ కళ్యాణ్. ఎక్కడా కూడా బోర్ లేకుండా, ఆద్యంతం వినోదభరితంగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు. సినిమా మొత్తం వినోదభరితంగా ఉండగా , పతాక సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే విధంగా ఉంటుంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరు కొత్తవాళ్లే అయ్యినప్పటికీ ఎక్కడా కూడా అలా అనిపించదు. మంచి అనుభవం ఉన్న వాళ్ళు తీసినట్టుగా అనిపిస్తాది.

ఇక ఈ చిత్రం లో శంకర్ పాత్ర పోషించిన శ్రీరామ్ నిమ్మల చాలా చక్కగా నటించాడు. లుక్స్ పరంగా కానీ , యాక్టింగ్ పరంగా కానీ ఇతనిది సినిమాకి పెద్ద హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమా చూస్తునంతసేపు ఈ కుర్రాడు కచ్చితంగా భవిష్యత్తులో టాప్ రేంజ్ కి వెళ్తాడు, పెద్ద బ్యానర్స్ చేతిలో పడాలి అని ప్రతీ ఒక్కరికి అనిపిస్తాది. అలాగే బ్రహ్మం మరియు విష్ణు పాత్రలు పోషించిన దేవరాజ్ పాలమూర్ మరియు అవినాష్ చౌదరి లు ప్రేక్షకులను ఆకట్టుకునే రేంజ్ లోనే నటించారు. ముఖ్యంగా బ్రహ్మం పాత్రలో నటించిన దేవరాజ్ పాలమూర్ పాత్ర చాలా వినోదం ని పంచుతుంది. అంతా బాగానే ఉంది కానీ , సంగీతం మరియు సినిమాటోగ్రఫీ ఇంకా కాస్త క్వాలిటీ మైంటైన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అయితే తక్కువ బడ్జెట్ లో కొత్తవాళ్లతో ఇంతకు మించి ఎవ్వరూ తియ్యలేరనే చెప్పాలి.

చివరి మాట :

ఈ వీకెండ్ లో మరో టైం పాస్ ఎంటర్టైనర్. మీ స్నేహితులతో కలిసి ఈ చిత్రం చూసి మంచిగా ఎంజాయ్ చెయ్యొచ్చు.

రేటింగ్ : 3/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com