Jr NTR: ఇటీవల కాలంలో కోర్టులు, పోలీసులను ఆశ్రయిస్తున్న సెలబ్రిటీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని సార్లు వారే వివాదాల్లో చిక్కుకుంటుండగా… మరి కొన్ని సెలబ్రిటీలే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వాటి పరిష్కారం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం హైకోర్టును ఆశ్రయించాడు. ఇంతకు వివాదం ఏంటి.. ఎందుకు ఎన్టీఆర్ కోర్టును ఆశ్రయించాంటే..
ఒక భూవివాదం నిమిత్తం ఎన్టీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో ఈ వివాదం స్టార్ట్ అయింది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ఎన్టీఆర్ ఈ ప్లాట్ ను కొనుగోలు చేశారు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్లాట్ మీద ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీతా లక్ష్మీ ఫ్యామిలీ లోన్స్ తీసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి.. ఏకంగా మూడు, నాలుగు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంది ఆమె. అయితే ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో లోన్ల విషయాన్ని దాచి పెట్టింది. ఇప్పటి వరకు ఆమె ఐదు బ్యాంకుల నుండి ఇదే ప్లాట్ డాక్యుమెంట్ల మీద లోన్స్ తీసుకుంది.
కానీ ఎన్టీఆర్ కు ప్లాట్ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే లోన్ తీసుకున్నట్లు చెప్పింది. చెన్నై లోని ఒక బ్యాంక్ లో ఆ లోన్ ఉండగా.. దాన్ని క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నాడు ఎన్టీఆర్. 2003 నుండి ఆ ప్లాట్ ఒనర్ గా ఎన్టీఆర్ ఉన్నారు. అప్పటి నుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది. ఎన్టీఆర్ కొన్న ప్లాట్ ను స్వాధీనం చేసుకునేందుకు మిగతా బ్యాంకుల మేనేజర్లు ట్రై చేస్తున్నారు. దాంతో ఆ బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ వివాదంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా డీఆర్టీ ఆర్డర్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3 లోపు డీఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.