Anchor Shyamala : పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాంకర్లలో యాంకర్ శ్యామల కూడా ఒకరు.. వరుస షోలు చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తూ కొత్త ఇల్లు, కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే..ఎప్పుడూ హోమ్లీ గా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.. అయితే ఈ అమ్మడు గురించి ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.. కట్టుకున్న భర్తకు కనీసం విలువ ఇవ్వలేదంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అలా అనడానికి కూడా కారణాలు ఉన్నాయని సమాచారం.. అసలు విషయానికొస్తే..

యాంకర్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో యాంకర్ గా, నటిగా కొనసాగుతూనే ఉంది. ఇక ఈమెకు పెళ్లవ్వగా ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన నటుడే.పలు సీరియల్స్ లో కనిపించి ఫెమస్ అయ్యాడు.. కాగా, ఇక కెరీర్ మొదట్లో అడుగుపెట్టిన శ్యామలకు.. ఇప్పుడున్న శ్యామలకు చాలా మార్పు వచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా తన గెటప్ విషయంలో చాలా మార్పు వచ్చింది. ఎప్పటినుంచో యాంకర్ గానే కొనసాగుతున్నప్పటికీ కూడా ప్రతిసారి ఈమెలో కొత్త కొత్త యాంగిల్ బయట పెడుతూ వచ్చింది.

ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చింది..ఇది ఇలా ఉండగా తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది. అందులో తను ట్రెడిషనల్ లుక్ లో ఉండగా కెమెరాకు ఫోజులిచ్చింది. అయితే ఆమె మెడలో తాళిబొట్టు లేకపోవడంతో కొందరు జనాలు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఓ నెటిజన్.. యాంకర్స్ మరీ ఘోరంగా తయారవుతున్నారు… ఎప్పుడూ పేరు కోసం చూస్తున్నారు తప్ప మొగుడు అవసరం లేదు.. అది కూడా లేకుండా ఈవెంట్స్ చేస్తున్నారు అంటూ కామెంట్ చెయ్యగా.. మరికొంతమంది పేరుకే మొగుడు మిగితా వాటికి వాడికి సంబందించినవి అవసరం లేదంటూ ఓ రేంజులో నెటిజన్లు ఆడుకుంటున్నారు.. మరి దీనిపై యాంకర్ శ్యామల ఎలా స్పందిస్తుందో చూడాలి..