Anasuya : జాకెట్ విప్పడంతో దారుణంగా తిట్టిన నెటిజన్స్.. ఘాటుగా స్పందించిన అనసూయ

- Advertisement -

Anasuya : అనసూయ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లితెర పై జబర్దస్త్‌‌ కామెడీ షోతో మెప్పించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత సినిమాల్లో పలు కీలక పాత్రలు చేసి క్రేజ్ దక్కించుకుంది. బుల్లి తెరపై చేసిన గ్లామర్ షో ఇక్కడ చేయనప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్లతో దూసుకుపోయింది. పుష్ప2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బుల్లి తెరకు గుడ్ బై చెప్పిన తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయిన అనసూయ ఆ మధ్య ఓసారి జబర్దస్త్ షోపై షాకింగ్ కామెంట్లు చేసింది. అందులో చేసే డబుల్ మీనింగ్ కామెడీ తనకు అంతగా నచ్చడం లేదంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇప్పుడు మళ్లీ టెలివిజన్ షోలలో చేయడానికి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఆమె రీ ఎంట్రీ ఇచ్చిన ఓ టీవీ షో ప్రోమో తెగ వైరల్ అవుతోంది. ఇందులో శేఖర్ మాస్టర్, అనసూయ ఇద్దరూ ఏదో పోటీకి సిద్ధం అవుతారు. ఈ క్రమంలో ఆమె అందరి ముందు తన జాకెట్ విప్పుతున్న ఓ సన్నివేశాన్ని ప్రోమోలో చూపించారు. ఇది చూసిన నెటిజన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ‘జాకెట్ విప్పిన అనసూయ’ అంటూ తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్న పలువురు నెటిజన్లకు ఆమె ఘాటు రిప్లై ఇస్తోంది. ‘నిజంగా ఇది నాన్‌సెన్స్ ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది’ అని ఓ నెటిజన్ చేసిన కామెంట్ పై స్పందించింది.. ‘‘మీరు పెట్టిన ఎమోజీలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నట్లున్నారు’’ అంటూ గట్టిగా ఇచ్చి పడేసింది. ‘‘ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులుగా మేము కొన్ని చేయక తప్పదు. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్లుగా నడుచుకోవాలి. ఇది మీకు అర్థం కావట్లేదు. మీ ప్రతాపం అంతా స్మాల్ స్ర్కీన్‌పై‌నే. అదే సినిమాల్లో ఎంత బోల్డ్ ఉంటే అంత బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తారు. కొందరికి ప్యాంట్, షర్ట్స్ కూడా ఇబ్బందే. నేనేం చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇకనైనా మారండి’’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అనసూయ.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here