Trivikram Srinivas : ప్రస్తుతం మన టాలీవుడ్ లో టాప్ 3 డైరెక్టర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఉంటుంది. హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ మరియు బ్రాండ్ వేల్యూ ఏ డైరెక్టర్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఒక రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కెరీర్ ని ప్రారంభించిన త్రివిక్రమ్ ఆ తర్వాత ‘నువ్వే నువ్వే’ సినిమాతో డైరెక్టర్ గా మారాడు.

కెరీర్ మొత్తం మీద ఆయనకీ ఖలేజా మరియు అజ్ఞాతవాసి చిత్రాలు తప్ప మరో ఫ్లాప్ లేదు. దాదాపుగా 90 శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు ఆయన. అందుకే త్రివిక్రమ్ తో కనీసం ఒక్క సినిమా అయినా చెయ్యాలని ప్రతీ స్టార్ డైరెక్టర్ కోరుకుంటాడు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తాను పని చేసే హీరోయిన్స్ తో అఫైర్స్ నడుపుతాడని ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో ఒక రూమర్ ఉంది. దీనిపై త్రివిక్రమ్ కూడా ఎప్పుడు స్పందించలేదు. పూనమ్ కౌర్ వంటి హీరోయిన్లు నేరుగా మీడియా ముందుకు వచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదంతా పక్కన పెడితే యాంకర్ గా, నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న భాను శ్రీ బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా మరింత క్రేజ్ ని సంపాదించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఈమె త్రివిక్రమ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

ఆమె మాట్లాడుతూ ‘నేను రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్స్ తో కూడా పని చేశాను, కానీ నాకు ఇష్టమైన డైరెక్టర్ మాత్రం త్రివిక్రమ్ గారే. ఆయన సినిమాలో నటించే అవకాశం కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాను. సినిమాలో నటించే ఛాన్స్ రాలేదు కానీ, ఒక యాడ్ లో నటించే ఛాన్స్ దక్కింది. షూటింగ్ బ్రేక్ సమయం లో నేను త్రివిక్రమ్ గారిని కలిసి ఐ లవ్ యు అని చెప్పాను. అప్పుడు త్రివిక్రమ్ గారు కూడా ఐ లవ్ యూ టూ అన్నాడు. ఆ విధంగా మా మధ్య కాసేపు లవ్ ట్రాక్ నడిచింది’ అంటూ చెప్పుకొచ్చింది.