Pawan: పవన్ కోసం ఆ రూల్ బ్రేక్ చేసిన త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన భార్య సాయి సౌజన్య..

- Advertisement -

Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ చాలా ఏళ్లుగా వారి పరిచయం కొనసాగుతోంది. ఈ ఇద్దరి స్నేహం సినిమాలకు అతీతమైనదని సన్నిహితులు చెబుతుంటారు. పవన్ కళ్యాణ్ వరుసగా త్రివిక్రమ్ తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇతర దర్శకులతో పవన్ చేస్తోన్న సినిమాలకు మాటలు, కథపరమైన సహాయాన్ని తివిక్రమ్ అందిస్తోన్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య స్నేహం బలపడటానికి పుస్తకపఠనం కూడా ఓ కారణం. కాగా.. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి త్రివిక్రమ్ భార్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Pawan
Pawan

పవన్‌ కళ్యాణ్‌ కు సాహిత్యంపై పట్టు పెరగడానికి కారణమైన వారిలో త్రివిక్రమ్ ముందు వరుసలో ఉంటారు. పవన్ కళ్యాణ్‌, త్రివిక్రమ్ స్నేహంపై త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన దగ్గర ఉన్న పుస్తకాల్ని త్రివిక్రమ్ ఎవరికీ ఇవ్వరని సాయి సౌజన్య చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ అడిగితే మాత్రం కాదనకుండా ఇచ్చేస్తారు అని.. ఆ విషయంలో మాత్రం త్రివిక్రమ్ పెట్టుకున్న రూల్ ని పవన్ కోసం క్రాస్ చేస్తారని ఆయన భార్య చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది..

పవన్ కళ్యాణ్ తరచుగా తమ ఇంటికి వస్తారని.. ఆ సమయంలో పవన్‌, త్రివిక్రమ్ ఇద్దరు బయటి ప్రపంచాన్ని మరచిపోయి కబుర్లలో మునిగిపోతారని.. తమ ఇంటి భోజనం అంటే పవన్‌కు ఇష్టమని, ఉప్మా, ఆవకాయ, వెజిటేరియన్ వంటకాల్ని ఎక్కువగా తింటారని సాయి సౌజన్య చెప్పుకొచ్చారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ తమ ఇంట్లో మనిషిలా కలివిడిగా ఉంటారని.. పవన్ కళ్యాణ్‌, త్రివిక్రమ్ మధ్య స్నేహం గురించి సాయిసౌజన్య చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. ఇటీవల విడుదలైన బుట్టబొమ్మ, సార్ సినిమాలకు సాయిసౌజన్య నిర్మాతగా వ్యవహరించింది.. ప్రస్తుతం ఈమె త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ స్నేహబంధం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here