Actress : త్రిష ఈ పేరుతో పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. లాంగ్ రన్ కెరీర్ కంటిన్యూ చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. ఆ మధ్య సోషల్ మీడియాలో సైతం మార్మోగిపోయింది అమ్మడి పేరు. కారణం త్రిష మీద నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలే. మళ్లీ అవి మరువకముందే ఆమె మీద తమిళనాడుకు చెందిన ఒక పొలిటీషియన్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

వాస్తవానికి మన్సూర్ అలీ ఖాన్ త్రిష మీద చేసిన వ్యాఖ్యల సమయంలో ఆమెకు ఇటు అభిమానుల నుంచి.. అటు ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ముందు మన్సూర్ అలీ ఖాన్ తాను తప్పు ఏమీ మాట్లాడలేదని చెప్పినా చివరకు బాధపడిక్షమాపణలు చెబుతున్నానని ప్రకటించాడు. ఈ విషయం మీద రివర్స్ లో మన్సూర్ అలీ ఖాన్ పలువురిపై పరువు నష్టం దావా వేసి కోర్టు చేత చివాట్లు కూడా తిన్నాడు. ఆ అంశం ఇంకా మరుగున పడకముందే ఇప్పుడు త్రిష మీద తమిళనాడుకు చెందిన ఏవీ రాజు అనే ఒక రాజకీయనేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె పాతిక లక్షల కోసం ఒక పొలిటిషియన్ తో నైట్ గడిపిందని ఆయన ఆరోపించారు.

ఈ అంశం కలకలం సృష్టిస్తుండడంతో త్రిష తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కొంతమంది తెలివితక్కువ వాళ్లు, వేరే వాళ్ల జీవితాలను ఆధారంగా చేసుకుని బతికుతుంటారు. వాళ్ల అటెన్షన్ కోసం ఎంత దారుణానికైనా దిగజారుతారనే విషయం తెలిసి చాలా బాధ కలుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాను. ఈ విషయంలో నేను చెప్పాల్సిందేమీ లేదు. ఎందుకంటే ఇక మీదట నా లీగల్ టీం ఈ విషయం మీద ముందుకు వెళుతుందంటూ తాను చెప్పుకొచ్చారు. ఆమె ఏ విషయం మీద స్పందించారనే క్లారిటీ ఇవ్వకపోయినా నిన్ననే ఏవీ రాజు త్రిష గురించి వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యాఖ్యల గురించే త్రిష స్పందించిందని భావిస్తున్నారు. ఆమెకు మద్దతుగా కూడా మీమున్నామంటూ అభిమానులకు కామెంట్స్ చేస్తున్నారు.