Trisha : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో త్రిష పేరు ముందు వరుసలో ఉంటుంది. మన చిన్న తనం లో చూసిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పటికీ లీడింగ్ హీరోయిన్ గా ఇండస్ట్రీ లో కొనసాగడం అనేది సాధారణమైన విషయం కాదు. రీసెంట్ గా తమిళ నాడు ని షేక్ చేసిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ మరియు లియో చిత్రాలలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన మార్కులు కొట్టేసింది త్రిష.

అలా ఇప్పటికీ పీక్ ఫామ్ లో కొనసాగుతున్న త్రిష పై ‘లియో’ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించిన ‘మన్సూర్ అలీ’ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో పెను దుమారంనే రేపింది. అతను మాట్లాడుతూ ‘నేను లియో చిత్రం లో త్రిష ని రే** చేసే సన్నివేశం కానీ, బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయని ఆశించాను, కానీ నా దురదృష్టం కొద్దీ డైరెక్టర్ అలాంటి సన్నివేశాలు రాయలేదు’ అని అంటాడు.

దీనికి త్రిష తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చింది..ఆమె మాట్లాడుతూ ‘మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా పై చేసిన కామెంట్స్ ని దృష్టికి వచ్చింది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇప్పటి వరకు నా ఇన్నేళ్ల సినీ కెరీర్ లో నేను అలాంటి సన్నివేశాల్లో నటించలేదు. రాబొయ్యే భవిష్యత్తులో కూడా నేను అలాంటి సన్నివేశాల్లో నటించను. నా సహా నటీనటులతో కూడా అలాంటి సన్నివేశాలు చెయ్యడానికి ఇష్టపడను. ఇలాంటి వ్యక్తి ఉన్న సినిమాలో నేను నటించినందుకు సిగ్గు పడుతున్నాను. అతను చేసిన కామెంట్స్ మనిషి జాతికే అవమానకరంగా ఉంది’ అంటూ రెస్పాన్స్ ఇచ్చింది. త్రిష ఈ స్థాయిలో ఒక నటుడిపై విరుచుకు పడడం ఆమె ఇన్నేళ్ళ సినీ కెరీర్ లో మనం ఎప్పుడూ కూడా చూడలేదు. మొట్టమొదటిసారి ఆమె నుండి ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఆమె ఏ రేంజ్ లో హర్ట్ అయ్యింది అనేది.