Trisha : దక్షిణాది ఇండస్ట్రీలో హీరోయిన్ గా రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోంది త్రిష. వయసు ఎక్కువవుతున్నా తన అందం మాత్రం అందం నానాటికి పెరుగుతూనే ఉంది. లాంగ్ రన్ కెరీర్ కొనసాగించిన వారిలో త్రిష ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటికీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన స్టార్ హీరోయిన్ లకి పోటీగా నిలుస్తోంది త్రిష. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ్ స్టార్ హీరోలు అజిత్, కమల్ హాసన్ చేస్తున్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో నటించే ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. తమిళ్ డైరెక్టర్ వినయ విష్ణువర్ధన్, సల్మాన్ ఖాన్ తో ‘ది బుల్’ అనే సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1988 ఆపరేషన్ కాక్టస్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది.

ఇక ఇందులో ఫరూక్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తుండగా.. అతని భార్యగా త్రిష చేస్తున్నట్లు బాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. త్రిష పాత్రకి కథలో చాలా ప్రాముఖ్యత ఉందని.. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సల్మాన్ కి భార్య కాబోతున్న త్రిష అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.