Trisha : స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూపు తిప్పుకోనివ్వని అందం, అద్భుతమైన నటన ఆమె సొంతం. సౌత్ ఇండియాపై తన ప్రభావాన్ని చూపిస్తూ.. సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది త్రిష. అనతి కాలంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది ఈ భామ. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకు వెళ్తుంది. దాదాపు 20ఏళ్ల అయినా చెక్కు చెదరని అందంతో ఇప్పటికీ తనదైన మార్కును చూపిస్తూ ముందుకు వెళ్తుంది. దాదాపు 40ఏళ్లు వచ్చినా ఇంకా త్రిష పెళ్లి చేసుకోలేదు. గతంలో ఎన్నో సార్లు త్రిష పెళ్లి వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఈ స్టార్ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది.
త్రిష ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్లను అందుకుంటుంది. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర, కమల్ తో థగ్ లైఫ్, విదాముమార్చి, వంటి భారీ ప్రాజెక్టుల్లో భాగస్వామి అయింది. ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ స్టార్ డైరక్టర్‌తో పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. త్రిష ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే తమిళ నిర్మాత, బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియన్‌తో వివాహం కుదిరింది. వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ల బంధం పెళ్లి వరకు వెళ్లలేదు.
ఈ క్రమంలోనే మరో సారి ఈ బ్యూటీ త్వరలోనే మాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాతను పెళ్లాడబోతుందట. వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల క్రితం ఓ సినిమా చేస్తున్న సమయంలో ప్రేమ చిగురించిందని ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ ఏడాదే వారిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తన పెళ్లి వార్తలపై తాజాగా హీరోయిన్ త్రిష స్పందించింది. ఈ మేరకు ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘నా పెళ్లికి సంబంధించిన వారు ఇప్పటికే చాలా ఎక్కువ అయ్యాయి. త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు రాస్తున్నారు. కానీ వాటిలో ఏ మాత్రం నిజం లేదు. నేను ప్రస్తుతం నా కెరీర్‌పై దృష్టి పెట్టాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ముందు మీకే చెప్తాను’ అని స్పష్టం చేసింది. దీంతో ఎప్పటికి పెళ్లి చేసుకోదేమో త్రిష అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.