Trisha – Vijay : త్రిష విజయ్ ప్రైవేట్ ఫోటోలు లీక్.. నెట్టింట్లో దూమారం రేపుతున్న వారి వ్యవహారం

- Advertisement -

Trisha – Vijay : స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు అందరికీ సుపరిచితురాలే. దాదాపు 20సంవత్సరాలుగా హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతోంది. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 40ఏళ్లు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తోంది. ఈ మధ్య కొన్నాళ్లు సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. మణిరత్నం ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అంతేకాకుండా ఇటీవల దళపతి విజయ్‌తో కలిసి లియో అనే సినిమాలో నటించి భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. వాస్తవానికి వీరిద్దరి కాంబోకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ కూడా ఉంది.

Trisha - Vijay
Trisha – Vijay

ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం విజయ్ 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే త్రిష తన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రైవేట్ ఫొటో లీక్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ ఫోటోకు ఓ పాటను కూడా యాడ్ చేసి మరీ షేర్ చేయడంతో అది నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో పలు పుకార్లు షికార్లు చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుందంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిని బేస్ చేసుకుని త్రిష, విజయ్ కలిసి ఎన్నోసార్లు వెకేషన్‌కు వెళ్లారని కొన్ని ఫొటోలను లీక్ చేస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -

అందులో త్రిషతో కలిసి నడుస్తున్న విజయ్ ఫొటో.. త్రిష దగ్గరగా విజయ్ కాలు ఉన్న ఫొటో కూడా ఉంది. అలాగే కాళ్ల దగ్గర కూర్చున్నది ఇలా కొన్ని ఫోటోలను బయటకు రావడంతో అంతా వీరిద్దరి వ్యవహారం నిజమేనేమో అని భావిస్తున్నారు. ప్రస్తుతం త్రిష, విజయ్ ఫొటోలు నెట్టింట్లో పెద్ద రచ్చ సృష్టిస్తున్నాయి. నిజానికి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిఫ్ ఉన్నప్పటికీ కొందరు కావాలనే కొన్ని ఫొటోలు ఆధారంగా వారి మధ్య ఏదో ఉందనే ఊహాగానాలకు తెరలేపారు. కానీ వారి అభిమానులు మాత్రం అవన్నీ కొట్టిపారేస్తూ మూడు.. నాలుగు సినిమాల్లో కలిసి నటించారు కాబట్టి ఆ మాత్రం ఫ్రెండషిప్ ఉండదా అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here