నిర్మాతతో పెళ్లిపై పచ్చిగా స్పందించిన త్రిష.. తనకన్నీ తెలుసుటా..

- Advertisement -

కెరీర్‌ ప్రారంభించి 20 ఏళ్లుపైగానే అవుతున్నా ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు త్రిష. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’తో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన ఆమె త్వరలో ‘లియో’తో సందడి చేయనున్నారు. విజయ్‌ హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 19న విడుదల కానుంది. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘ది రోడ్‌’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు, ‘రామ్‌: పార్ట్‌ 1’లో మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్‌ సరసన త్రిష నటిస్తున్నారు. ‘ఐడెంటిటీ’, మరో రెండు తమిళ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.
ఇక మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ నిర్మాతను త్రిష పెళ్లి చేసుకోనున్నారంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి.

సోషల్‌ మీడియాలో సంబంధిత పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. ఇవి త్రిష దృష్టికి వెళ్లగా ఆమె స్పందించారని కొందరు అభిమానులు అభిప్రాయపడగా.. సినిమాల విషయంలో తనకు వ్యతిరేకంగా వ్యహరిస్తున్న పీఆర్‌ టీమ్ గురించి ఇలా పరోక్షంగా పోస్ట్‌ పెట్టారంటూ కోలీవుడ్‌ మీడియా పేర్కొంది. ప్రియమైన ‘మీరు మీతో పాటు ఉన్న మీ బృందం ఎవరో మీకు తెలుసు. శాంతంగా ఉండండి. ఇంతటితో ఈ పుకార్లు ఆపండి. చీర్స్! అంటూ తనదైన స్టైల్లో త్రిష తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేసింది. గత కొన్ని రోజులుగా హీరో విజయ్‌కి చెందిన లియో సినిమా ప్రమోషన్‌ కీప్ కామ్‌గా ప్రమోట్ అవుతుండటంతో, నటి త్రిష కూడా అదే పదాలను ఉపయోగించి ఈ ట్వీట్‌ చేయడం మరింత చర్చనీయాంశమైంది.

trisha

ఇది విజయ్, అతని బృందానికి వార్నింగ్? ఇస్తున్నావ్‌ కదా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎవరినుద్దేశించి ఆ కామెంట్‌ చేశారో త్రిషకే తెలియాలని పలువురు నెటిజన్లు అన్నారు. త్రిష పెళ్లి విషయంలో రూమార్స్‌ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు ఆమె వివాహం గురించి ఊహాగానాలు వచ్చాయి. ఓ సందర్భంలో వాటిపై స్పందిస్తూ.. అవన్నీ వదంతులంటూ ఖండించారు. ఫోకస్‌ అంతా సినీ కెరీర్‌పైనే ఉందని, ఒకవేళ వివాహబంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే తప్పకుండా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని త్రిష తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here