Trisha : సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సృష్టిస్తోంది. సందీప్‌కు బాలీవుడ్‌లో ఇది రెండో సినిమానే అయినా.. ఇందులో వయొలెన్స్, యాక్షన్ చూసి ఇప్పటివరకు ఏ దర్శకుడు ఇలాంటి యాక్షన్‌ను తెరకెక్కించలేదని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష సైతం మూవీ చూసి ఫిదా అయ్యింది. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘యానిమల్’ చిత్రానికి తన రివ్యూను అందించింది.

కానీ దీని కారణంగా చాలా నెగిటివిటీని కూడా ఎదుర్కుంది. దీంతో కాసేపట్లోనే ఆ రివ్యూ పోస్టును డిలీట్ చేసింది. సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్‌తో జరిగిన వివాదం వల్ల త్రిష పేరు గతకొంతకాలంగా న్యూస్‌లో వినిపిస్తోంది. ఇదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘యానిమల్’ చిత్రాన్ని పొగుడుతూ.. ఈ భామ స్టోరీలు పెట్టింది. ఈ స్టోరీల్లో రణబీర్ కపూర్ ‘యానిమల్’ పోస్టర్‌ను పెట్టి.. ‘ఒక్కే మాట – కల్ట్. పాప్పా’ అంటూ పలు ఎమోజీలను కూడా యాడ్ చేసింది త్రిష. దీంతో త్రిషకు ఈ సినిమా ఎంత నచ్చిందో అర్థమవుతోంది. తను ఈ మూవీకి పాజిటివ్ రివ్యూనే ఇచ్చినా కూడా నెటిజన్లకు మాత్రం ఎందుకో ఈ విషయం నచ్చలేదు. దీంతో ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ‘యానిమల్’ రివ్యూను డిలీట్ చేసింది త్రిష. ‘యానిమల్’కు త్రిష ఇచ్చిన రివ్యూ డిలీట్ అవ్వకముందే దానిని చూసిన పలువురు నెటిజన్లు స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోవడంతో.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘యానిమల్’ చిత్రంలో రణబీర్ కపూర్ పాత్ర చాలా టాక్సిక్‌గా ఉంటుంది. అయితే అలాంటి పాత్రలను సపోర్ట్ చేసి మాట్లాడినందుకు త్రిషకు ఘోరంగా నెగిటివిటీ ఎదురవుతోంది. మన్సూర్ అలీ ఖాన్.. తనపై రేప్ కామెంట్స్ చేశాడని, తనతో బెడ్ రూమ్ సీన్ లేదని ఫీల్ అయ్యానని వ్యాఖ్యలు చేశాడని సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేగింది. అలాంటిది మహిళలను అసలు సరిగా ట్రీట్ చేయని ‘యానిమల్’లాంటి చిత్రానికి త్రిష ఎలా సపోర్ట్ చేస్తుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.