Trisha : సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్స్ గా పిలవబడే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ లో నయనతార, త్రిష పేర్లు కచ్చితంగా వినిపిస్తాయి. త్రిష హీరోయిన్ అయ్యే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఆ తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ అనతి కాలం లోనే పెద్ద స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నాలుగు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ ఆమె చేతిలో క్రేజీ సినిమాలు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమె రేంజ్ ఎలాంటిది అనేది. త్రిష కంటే ఆలస్యంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నయనతార కూడా అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

కేవలం కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఎన్నో చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది నయనతార. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. కానీ బయట ఒకప్పుడు వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. కానీ కొన్నాళ్ళకు వీళ్లిద్దరి మధ్య కొన్ని విబేధాలు రావడం తో చాలా కాలం నుండి వీళ్ళ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని కోలీవుడ్ లో జోరుగా సాగుతున్న చర్చ. ఒకానొక ఇంటర్వ్యూ లో త్రిష మాట్లాడుతూ నయనతార తో విభేదాలు ఉన్న విషయం వాస్తవమే అని చెప్పుకొచ్చింది. కానీ కాలం గడిచే కొద్దీ నిజానిజాలు తెలిశాయని, ఇప్పుడు మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు అని చెప్పుకొచ్చింది.
అయితే వీళ్లిద్దరి మధ్య విబేధాలు రావడానికి కారణం తమిళ హీరో శింబు అని తెలుస్తుంది. అప్పట్లో నయనతార శింబు మధ్య ప్రేమాయణం నడిచిన సంగతి తెలిసిందే. అదే సమయం లో శింబు తో కూడా త్రిష ప్రేమలో ఉందని అప్పట్లో రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్ నయనతార, శింబు మధ్య చిచ్చు పెట్టాయని, అందుకే వాళ్లిద్దరూ విడిపోయారు అంటూ అప్పట్లో కోలీవుడ్ లో పెద్ద చర్చ నడిచింది. కానీ అవి కేవలం రూమర్స్ మాత్రమే అని, త్రిష కి శింబు కి మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. త్రిష కూడా ఇంటర్వ్యూ లో ఈ విషయం గురించే పరోక్షంగా ప్రస్తావించింది అంటూ కోలీవుడ్ మీడియా ప్రచారాలు చేసింది.