Ooru Peru Bhairavakona : విడుదలైన రెండు రోజుల్లోనే ఓటీటీలోకి ‘ఊరి పేరు భైరవకోన’..కన్నీళ్లు పెట్టుకున్న సందీప్ కిషన్!

- Advertisement -

Ooru Peru Bhairavakona : చాలా కాలం నుండి కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న సందీప్ కిషన్, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ అతనికి కాలం కలిసిరాక చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం గట్టిగా హిట్ కొట్టాలి అనే కసితో చేసిన చిత్రం ‘ఊరిపేరు భైరవకోన’.

విడుదలకు ముందు నుండే ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్ వంటి వాటికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్ షోస్ వెయ్యగా, ఆ షోస్ లో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదల రోజు అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుండి ప్రీమియర్స్ లో వచ్చిన పాజిటివ్ టాక్ కొనసాగడం తో ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

మొదటి రోజు ఈ చిత్రానికి రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగ, రెండవ రోజు ఈ చిత్రానికి మూడు కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇలా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ అప్పుడే సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.

- Advertisement -

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ 5 సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న డీల్ ప్రకారం, ఈ చిత్రాన్ని 45 రోజులు పూర్తి అవ్వగానే జీ 5 యాప్ లో టెలికాస్ట్ కానుంది. అంటే మార్చి నెలాఖరులో ఈ సినిమా విడుదల కాబోతుంది అట. ఒకవేళ ఈ చిత్రం సోమవారం నుండి డ్రాప్స్ భారీగా సొంతం చేసుకుంటే, మార్చి మొదటి వారం లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here