Sania Mirza : రీసెంట్ గా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న పేరు సానియా మీర్జా. తన భర్త సోహెబ్ మాలిక్ తో విడాకులు జరిగిన విషయం అధికారికంగా తెలియడం తో ఇప్పుడు ఎక్కడ చూసినా వీళ్లిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు.. రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో సనా జావేద్ అనే హీరోయిన్ ని పెళ్ళాడి దానికి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో సోహెబ్ మాలిక్ అప్లోడ్ చెయ్యడం వల్ల ఈ విషయం అందరికీ తెలిసింది.
సానియా మీర్జా తో వైవాహిక జీవితం లో ఉన్నప్పుడే సోహెబ్ సనా జావేద్ తో గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడపడం వల్లే, సానియా అతనితో గొడవపడి తన కొడుకు తో కలిసి ఇండియా కి వచ్చేసింది అంటూ సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక వెర్షన్. మరో వెర్షన్ ఏమిటంటే సానియా మీర్జా ఒక ప్రముఖ టాలీవుడ్ హీరో తో రిలేషన్ మైంటైన్ చెయ్యడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు అంటున్నారు.
ఈ రెండిట్లో ఏది నిజమో తెలియదు కానీ, సానియా మీర్జా ఒక ప్రముఖ టాలీవుడ్ హీరో తో గత కొంత కాలం నుండి డేటింగ్ లో ఉంటుందని, గత ఏడాది కాలం గా ఈ తంతు జరుగుతుందని మాత్రం బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆమె పలు సందర్భాలలో హైదరాబాద్ లో అతనితో కలిసి ప్రైవేట్ ఫంక్షన్స్ కి వెళ్లడం మీడియా కి సంబంధించిన వాళ్ళు కళ్లారా చూసారు.
ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి వెళ్తే వాళ్ళ మధ్య ప్రేమ మాత్రమే ఉంటుందా?, స్నేహితులు అని అనుకోవచ్చు కదా అని మీకు అనిపించొచ్చు. కానీ ఆ హీరో సానియా మీర్జా కి రీసెంట్ గా ఆరు కోట్ల రూపాయిలు విలువ చేసే బంగ్లా ని బహుమతిగా ఇచ్చాడట. ఇదే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం. ఇంతకీ ఎవరు ఆ హీరో అనే విషయాన్నీ మీడియా ఇంకా లీక్ చెయ్యలేదు.