NTR-Srikanth : ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ వార్త విన్న వారంతా ఆశ్యర్యపోతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు దేవర సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు మామగా ఓ స్టార్ హీరో నటించబోతున్నాడా..? అంటే అవునంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మరెవరో కాదు హీరో శ్రీకాంత్. చిన్నప్పటి నుంచి బాబాయ్.. బాబాయ్ అంటూ ముద్దుగా పిలుచుకున్న శ్రీకాంత్ ని ఇప్పుడు ఎన్టీఆర్ మామ అని పిలవాల్సిన పరిస్థితి రానుంది.

ఇప్పటికే దేవర సినిమాపై రోజుకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇస్తూ యూనిట్ అంచనాలను భారీగా పెంచేస్తోంది. తాజాగా ఎన్టీఆర్ “దేవర” సినిమాలో శ్రీకాంత్ కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోయిన్ జాన్వి కపూర్ కు తండ్రిగా కనిపించబోతున్నాడట . అంతేకాదు ఈ సినిమాలో శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. మరి ముఖ్యంగా ఎన్టీఆర్, జాన్వి, శ్రీకాంత్ మధ్య వచ్చే సీన్స్ డైలాగ్స్ సినిమాకి హైలెట్ గా ఉండబోతున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఈ నెల 8 న తారక్ నటిస్తున్న దేవర గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమా ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా సాయి పల్లవి సెలక్ట్ అయిన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీగా రిలీజ్ చేసేందుకు గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది చిత్ర బృందం.