Sithara : సితార.. ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఈ జనరేషన్ వాళ్లకు సితార అనగానే మహేశ్ బాబు కూతురు గుర్తుకు వస్తుంది కానీ.. ఆ పేరుతో తెలుగులో సీనియర్ హీరోయిన్ ఉన్నారు. ఆమె చాలా సినిమాల్లో నటించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోయింది. ఆ తర్వాత తెలుగులో తల్లి, అక్క పాత్రలతో మెప్పిస్తుంది. మధ్య మధ్యలో సీరియల్స్ కూడా చేసింది. అయితే ఇప్పటికీ ఈమె శ్రీమతి కాదు.. కుమారి మాత్రమే. 50సంవత్సరాలు వచ్చినా ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోవడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ మధ్య కాలంలో ఈమె తెలుగులో చాలా సినిమాలు చేసింది. ముఖ్యంగా శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, బృందావనం, భరత్ ఆనే నేను, లెజెండ్, అరవింద సమేత లాంటి చాలా సినిమాలు చేసింది. అన్నింట్లోనూ ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ వరస సినిమాలతో బిజీగా ఉంటారమే. అయితే ఇన్నేళ్లుగా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే ఒక్క ముక్కలో తేల్చేసింది. తాను వివాహం చేసుకోకపోవటానికి కారణం జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవడమే అంటూ గతంలో ఓ సారి చెప్పుకొచ్చింది. ఆ కీలక వ్యక్తి ఎవరో కాదు.. తమిళ నటుడు మురళి.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దలకొండ గణేష్ సినిమా గుర్తుంది కదా అందులో ఆయనతో నటించిన అథర్వ తెలుసు కదా.. ఆయన తండ్రే మురళి. తమిళంలో స్టార్ హీరో ఈయన. అయితే చాలా చిన్న వయసులోనే ఈ లోకాన్ని వదిలేశాడు. 40ల్లోనే ఈయన మరణించడం సితారకు ఊహించని షాక్ తగిలినట్టు అయింది. ఎందుకంటే ఈ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తన ప్రాణ స్నేహితుడు మరణించడంతో ఆ బాధలోంచి తేరుకోవడానికి సితారకు చాలా రోజులే పట్టింది. మురళి మరణం తర్వాత సితార చాలా ఒంటరిగానే ఉండిపోయింది. మరోవైపు తన తండ్రి చనిపోయిన తర్వాత ఒక్కరు కూడా తన వివాహం గురించి ఆలోచించలేదని.. ఆ తర్వాత తాను కూడా ఆలోచించడం మానేశానని చెప్పింది. ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకునే సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటారా అని అడిగితే.. అలాంటి ఆలోచన లేదంటూ చెప్పుకొచ్చింది. తనకు జీవితంలో పెళ్లి వైపు అడుగులు వేసే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. ఈ జీవితం అంతా తనకు తానే తోడుగా ఉంటానని సితార చెప్పుకొచ్చింది.