షాక్.. సమంత ను దూరం పెట్టిన టాలీవుడ్ హీరోలు కారణం ఇదేనా..

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇప్పుడు సోలో కథానాయికగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. గతేడాది యశోధ లాంటి సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే శాకుంతలం (Shakuntalam) సినిమాతో సందడి చేసింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. సామ్ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో సామ్ యాక్టింగ్‌పై కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు సమంతను పలువురు స్టార్ హీరోలు దూరం పెట్టే శారని టాక్ వినిపిస్తోంది.

సమంత
సమంత

తాజాగా సామ్ తన పుట్టినరోజు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ హీరోల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప మరే హీరో కూడా సామ్ కు విషెస్ చెప్పలేదు. దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రామ్ చరణ్ మాత్రమే సమంతకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. మిగతా హీరోలెవ్వరు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో టాలీవుడ్ హీరోలు సమంతను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడుతున్నారా అందుకే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె నటిస్తున్న ఖుషి సినిమా నుంచి సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

సమంత న్యూస్

అయితే ఇటీవల సమంత ప్రవర్తన కారణంగానే వారంతా ఇలా చేశారని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో బడా నిర్మాతలతో ఎందుకులే అని వారంతా సైలెంట్గా ఉన్నారని కొందరు అంటున్నారు. అయితే ఈమె పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్స్ అందరూ వరుసగా సోషల్ మీడియా వేదికగా సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

అలాగే అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా సమంత కు శుభాకాంక్షలు తెలియజేశారు. కెరీర్‌ విషయానికి వస్తే.. ‘శాకుంతలం’ పరాజయంతో సమంత ఆశలన్నీ తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘సిటాడెల్‌’ పైనే పెట్టుకున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. దీని కోసం ఆమె ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here