Natasha Doshi : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలువురు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. హీరోయిన్లు, హీరోలు ఒకరి తర్వాత తమకు నచ్చిన వారిని సొంతం చేసుకుంటున్నారు. గతేడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు జాకీ బగ్నానీని పెళ్లాడింది. అలాగే టాలీవుడ్ హీరో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య కూడా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే ఆమెకు అక్షరపర్ధస్తో వివాహం జరిగింది.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తనయుడు హీరో ఆశిష్ ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం జరిగి త్వరలో పెళ్లికి సిద్ధమైంది. ఈ ఏడాది మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ముంబై అందాల హీరోయిన్ నటాషా దోషి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ నటి బాలయ్య నటించిన జై సింహా సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. దాంతో పాటు శ్రీకాంత్ నటించిన కోతలరాయుడు, కళ్యాణ్ రామ్ నటించిన ఎంతమంచివాడవురా చిత్రాలలో నటించి గుర్తింపు పొందింది.

ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ గతేడాది వ్యాపారవేత్త మనోజ్ షాతో నిశ్చితార్థం చేసుకుంది. వీరిద్దరూ జనవరి 31న పెళ్లి చేసుకున్నారు.. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. పెళ్లయిన నెల రోజుల తర్వాత ఈ ముద్దుగుమ్మ తాజాగా తమ పెళ్లి ఫొటోలను తాజాగా పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులంతా షాక్ అవుతున్నారు. అయితే పెళ్లి ఎక్కడ జరిగిందనే విషయంపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
