ఎలాంటి స్టార్ డమ్ లేని హీరోహీరోయిన్లు, చాలా తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఉప్పెన. పేరుకు తగ్గట్లే బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన సినిమా. నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. కన్నడ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి బేబమ్మ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అలాగే దర్శకుడు బుచ్చిబాబుకు కూడా డెబ్యూ మూవీతోనే తన టాలెంట్ ను బయటపెట్టాడు. బుచ్చిబాబు లెక్కల మాస్టారు సుకుమార్ ప్రియ శిష్యుడు.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సెన్సేషన్‌గా నిలిచింది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఇందులో నెగిటివ్ పాత్రలో జీవించాడు. 2021లో విడుదలై ఫస్ట్ షో నుంచే.. హిట్ టాక్ తెచ్చుకుంది. చిన్న చిత్రంగా వచ్చిన సినిమా కరోనా టైమ్‌లో ఉప్పెన వంద కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఉప్పెన మూవీకి ఫస్ట్ అనుకున్నది వైష్ణవ్ కాదట. టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో వద్దకు ఉప్పెన కథ వెళ్లిందట. కానీ, కథ వినకుండానే ఆయన రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నాని. బుచ్చిబాబు – నానీకి కథ చెప్పడానికి వెళ్లాడట. కానీ, అప్పటికే నాని చేతిలో కమిట్ అయిన చిత్రాలు చాలా ఉండడంతో బుచ్చిబాబు కథ చెబుతానన్న నాని సున్నితంగా నో అని చెప్పేశాడట. అలా నాని చేయాల్సిన సినిమా వైష్ణవ్ వద్దకు వచ్చింది.