Anchor Jyothi : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేమస్ అయిపోవడం కోసం జనాలు ఏం చేయడానికైనా వెనకాడడం లేదు. ప్రస్తుతం రీల్స్ చేయడం ఓ పిచ్చి అలవాటుగా మారిపోయింది. ఎక్కడపడితే అక్కడ సమయం సందర్భం చూసుకోకుండా రీల్స్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మెట్రో, బస్సులు, రైళ్లు, రోడ్లు, చివరకు బాత్ రూంలను కూడా వదలడం లేదు. కొందరైతే రీల్స్ పిచ్చిలో పడి ఏకంగా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో జనాలు నిబంధనలకు విరుద్ధంగా రీల్స్ చేస్తున్నారు. అలాంటి వారి లిస్ట్‌లో మన సెలబ్రిటీ, యాంకర్ సావిత్రి కూడా చేరిపోయింది.
తీన్మార్ వార్తలు ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు యాంకర్ సావిత్రి అలియాస్ శివ జ్యోతి. ప్రస్తుతం ఈమె యూట్యూబ్ ఛానల్ నడుపుతూ మరోవైపు బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొంటూ కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. తీన్మార్ వార్తలు ద్వారా తెలంగాణ యాసలో గలగల మాట్లాడేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది సావిత్రి. అదే ఫేమ్ తో బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇలా బిగ్ బాస్ తర్వాత ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. శివ జ్యోతి ప్రస్తుతం యూట్యూబ్ వీడియోల్లో తన భర్తతో పాటు తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.
రీసెంటుగా ఆమె హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు పై రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తప్ప మనుషులకు నడవడానికి ఛాన్స్ లేదు. ఓఆర్ఆర్‌పై అన్ని వెహికిల్స్ దాదాపు 120 స్పీడుతో వాహనాలు వెళ్తుంటాయి. అందుకే అప్పడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. మరి నిబంధనలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో రీల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ సావిత్రిని కడిగిపారేస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆమెను చూసి.. మరికొందరు రీల్స్ చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి వారిని ఓఆర్ఆర్‌పై రీల్స్ చేయకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లేదంటే రాబోయే రోజుల్లో ఓఆర్ఆర్‌ను రీల్స్‌కు అడ్డాగా మార్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి జ్యోతి పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
View this post on Instagram