Actress Saranya : న్యూడ్‌గా నటించినా ఇబ్బంది క‌ల‌గ‌లేదు.. కానీ..

- Advertisement -

Actress Saranya : టాలీవుడ్ నటి శరణ్య ఆమె.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అక్క గా ‘ఫిదా’ సినిమాలో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. చెల్లెలికి త‌న మ‌రిది ఇష్ట‌ప‌డ్డాడ‌ని తెలుసుకుని ప్రేమించవే అంటూ చేసిన రిక్వెస్ట్ అంద‌రిని ఆసీన్ ఆక‌ట్టుకుంది. ఇంత‌లా ఒక వ‌దిన‌లా, అక్క‌గా, కూతురుగా, భార్య‌గా చేసిన ఫిదాలో త‌న న‌ట‌న‌తో అంద‌రి దృష్టి త‌న‌వైపు మ‌ళ్లించుకుంది.

Actress Saranya

అయితే ఇప్పుడు శరణ్, సుహాస్ అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు శరణ్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఇందులో న్యూడ్ నటించినట్లు శరణ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. కానీ ఆమె నటనకు ఎంతో ప్రశంసలు కురిపించడంతో పాటు మరికొందరు విమర్శలు కూడా చేశారు. అయితే.. తాజాగా, శరణ్య తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు. ఈ చిత్రంలో న్యూడ్‌గా నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.

ఒక సినిమా మ‌నం ఒప్పుకుంటే అందులో చేసే ప్ర‌తి ప‌ని ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకోవాలి అంతేగానీ.. దానిని నేను చేయ‌లేను, నావ‌ల్ల కాదు అంటూ వెన‌క్కు త‌గ్గ‌కూడ‌దు. దాని వ‌ల్ల డైరెక్ట‌ర్ల‌కు పెద్ద ఇబ్బంది క‌లుగుతుంది. మ‌న‌మీద న‌మ్మ‌కంతో ఒక సినిమా మ‌న వ‌ర‌కు వ‌చ్చింది అంటే అది మ‌నం చేయ‌గ‌ల‌ము కాబట్టే అందులో మ‌న‌సీన్ ను డైరెక్ట‌ర్ ముందుగా ఊహించే ఇస్తారు. అలాంటిది ఆ న్యూడ్ సీన్ చేసేట‌ప్పుడు నాకు అంత‌లా అనిపించ‌లేదు. ఎందుకంటే నా భర్త ప్రోత్సాహంతో పాటుగా డైరెక్టర్ కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుంగా ఆ సీన్ చిత్రీకరించడం చాలా అనందం క‌లిగించింది.

- Advertisement -
saranya

అంతేకాదు.. అంతా అనుకున్నట్లుగానే ఆసీన్‌ రావడంతో ఎలాంటి సమస్య రాలేదు. అక్క‌డ మ‌నం చేసిన ప్ర‌తి సీన్ ను అక్క‌డున్న వారే కాదు, మ‌నం కూడా చూసి ఒకే అన్నాకే ఆసీన్ బాగుంది. సూప‌ర్ అంటూ అంద‌రూ ఆనంద‌ప‌డ‌తాం. అంతేకానీ.. న్యూడ్ చేసింది. భ‌ర్త అంగీకారంతోనే చేసింది. ఛీ ఛీ అంటూ కొందరు మాత్రం సోష‌ల్ మీడియాలో రాసిన రాత‌లు బాధ‌ను క‌లిగించాయి. నేను ఇంకేదో ఆశించి ఇలా న్యూడ్‌గా నటించానని చర్చించుకోవడం పలు సైట్లు దారుణంగా రాయడం బాధగా అనిపించింది.

అలాంటి వారు చూసే విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. మ‌నం ఆఫీస్ లో అయినా స‌రే వ‌ర్క్ చేస్తున్నామంటే మ‌న‌ల్ని న‌మ్మి ఒక‌రు ఒక ప‌ని అప్ప‌గించారంటే ఆ ప‌నికి మ‌నం అర్హులు అని అంతేగానీ..వ‌ర్క్ చేసేవాడు ఏదో ఆశించి చేస్తాడ‌ని కాదు అంటూ సెలెంట్ గానీ.. సెటైర్ వేసింది.

ప్రస్తుతం శరణ్య కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజ‌న్ అయితే నిజ‌మే శ‌ర‌ణ్య నువ్వు నీ వ‌ర్క్ ను క‌రెక్ట్ చేశావు.. లోకులు కాకులు ప‌ట్టించుకోకండి. మ‌నం ఇబ్బంది క‌లిగినా, ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చి ఎవ‌రూ ముందుకురారు, మ‌న‌తో వున్న మ‌న వ‌ర్క్ త‌ప్పా.. సో మీ ప‌ని చూసుకుంటూ ముందుకు వెళ్లండి ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here