Actor Nikhil: నిఖిల్ చేసిన పనికి ప్రశంసల వర్షం.. రియల్ హీరో అంటూ తెగ పొగిడేస్తున్నారు

- Advertisement -

Actor Nikhil: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హ్యాపీడేస్ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నిఖిల్. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆయన చేసిన పనికి పొగడ్తల వర్షం కురుస్తోంది. ఇంతకీ నిఖిల్ ఏం చేశాడో తెలుసా.. ? కొన్నేళ్లుగా మూసేసిన ఆలయాన్ని ఆయన తెరిపించారు. దాని నిర్వహణ బాధ్యతలను పూర్తిగా తానే తీసుకున్నాడు. గొప్ప పనిచేశావంటూ గ్రామస్థులు నిఖిల్ ను కొనియాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూతపడి ఉంది. ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించిన నిఖిల్‌పై గ్రామస్థులు ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్‌ను పూలపై నడిపించి ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించారంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు.

- Advertisement -

ఇటీవల కార్తికేయ-2తో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు నిఖిల్.. ప్రస్తుతం స్వయంభు సినిమాతో త్వరలో థియేటర్లోకి రానున్నాడు. నిఖిల్ ఇందులో వారియర్‌గా కనిపించబోతున్నాడు. ‘స్వయంభు’ అనే పీరియాడిక్ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి నిర్మాతలు భువన్, శ్రీకర్ భారీ బడ్జెట్ కేటాయించారు. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘స్వయంభు’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇటీవల నిఖిల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here