Mukku Avinash : శ్రీముఖి దగ్గర పది లక్షలు అప్పు చేసిన ముక్కు అవినాష్ తీర్చమని అడిగితే.. ?

- Advertisement -

Mukku Avinash : జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ఎంతోమందికి జీవితాన్ని ప్రసాదించింది. అంతే కాకుండా జబర్దస్త్ షోతో ఎంతోమంది కమెడియన్లు బుల్లితెర, అటు వెండితెరపై పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో అవినాష్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షోలో కంటెస్టెంట్‌గా చేసి ఆ తర్వాత ముక్కు అవినాష్‌గా గుర్తింపు తెచ్చుకుని టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం అవినాష్ వరుస సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు అందుకుంటున్నారు.

అయితే జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో అవినాష్ బిగ్ బాస్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. జబర్దస్త్‌లో.. ఆ షో నిర్మాణ సంస్థలో చేసే వారికి అక్కడ కొన్ని నియమనిబంధనలతో పాటు కొన్నాళ్లు అక్కడే చేయాలని బాండ్ కూడా ఉంటుంది. ఆ బాండ్ మధ్యలో బ్రేక్ చేసి వెళితే ఆ నిర్మాణ సంస్థకి భారీగా జరిమానా కట్టాల్సిందే. అయితే అవినాష్ జబర్దస్త్ లో చేస్తున్నప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్ అవకాశం రావడంతో ఆ బాండ్ బ్రేక్ చేసి బిగ్ బాస్‌కి వెళ్లాడు.

- Advertisement -

బిగ్ బాస్ హౌసులోకి వెళ్లేందుకు ఇబ్బంది లేదు కానీ బాండ్ బ్రేక్ చేసినందుకు జబర్దస్త్ నిర్మాణ సంస్థకు ముక్కు అవినాష్ 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టినట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో కి వెళ్లే సమయంలో నా దగ్గర అంత డబ్బు లేకపోవడంతో యాంకర్ శ్రీముఖి దగ్గర రూ.5 లక్షలు, తెలిసిన మరొకరి దగ్గర ఇంకో ఐదు లక్షలు తీసుకుని ఆ ఫైన్ కట్టాను. అప్పుగా తీసుకున్నా ఆ 10లక్షలు కూడా బిగ్‌బాస్ నుంచి తిరిగిరాగానే ఇచ్చేశాను.. బిగ్ బాస్ వల్ల నాకు బాగానే డబ్బులు వచ్చాయని.. ఆ తర్వాత టీవీ సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపాడు ముక్కు అవినాష్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here