Tillu Square Review : రెండు సంవత్సరాల క్రితం డీజే టిల్లుతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సిద్ధు జొన్నల గడ్డ. మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్ స్క్వేర్ తో ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి హైప్ తెచ్చుకున్నాడు. భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు అంచనాలను ఎంత అందుకుందో తెలుసుకుందాం.

ఇక స్టోరీ విషయానికి వస్తే….మొదటి సినిమాలోనే రాధిక వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న డీజే టిల్లు ఈ పార్ట్‌లో లిల్లీ జీవితంలోకి ఎంటరైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. తర్వాత వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది కథ. సినిమా కథ పాయింట్ పెద్దగా ఉండకపోవచ్చు కానీ.. పార్ట్ 1లో హీరో క్యారెక్టర్ లాగానే, టిల్ స్క్వేర్ కూడా పూర్తిగా సిద్ధు జొన్నలగడ్డ స్క్రీన్ ప్రెజెన్స్, క్యారెక్టర్ మీదనే నడుస్తుంది. హీరో సింగిల్ లైన్ పంచ్ లు కురిపించాడు. అవన్నీ థియేటర్లో ప్రేక్షకులను నవ్వించడంలో వర్క్ అవుట్ అయ్యాయి. కొన్ని చోట్ల ఇక చాలనుకున్నా.. హీరో సింగిల్ లైన్ పంచ్ ల వర్షం మాత్రం ఆగదు.
ఇక హీరోయిన్ అనుపమ పాత్ర గ్లామరస్ గా ఉండగా ఉన్నంతలో బాగా నటించింది. కానీ పార్ట్ 1 రేంజ్ లో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదని అనిపించినా.. ఓకే ఫర్వాలేదు.. మిగతా నటీనటులందరూ ఉన్నంతలో బాగా నటించారు. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే క్రిస్ప్ రన్ టైమ్ తో ఆకట్టుకున్నాయి. కొన్ని చోట్ల సీన్స్ రిపీటివ్ గా అనిపించడం ఒక్కటి కొంచెం సినిమాకు డ్రా బ్యాక్.
మ్యూజిక్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసింది. డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా హీరో సింగిల్ లైన్ పంచులు అతి పెద్ద ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. ఆల్ రెడీ ఫేమస్ అయిన డిజే టిల్లు పాత్రను ఏమాత్రం చెడగొట్టకుండా ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు సినిమాలో పెట్టారు డైరెక్టర్. స్టార్టింగ్ లో గ్లామర్ డోస్ కొంచెం ఎక్కువ అవ్వడంతో కొంచెం ట్రాక్ తప్పుతున్నట్లు అనిపించినా తిరిగి కథని జెట్ స్పీడ్ తో నడపడం మొదలు పెట్టి ఫర్వాలేదనిపించేలా ఇంటర్వెల్ ఎపిసోడ్ పెట్టి సెకెండ్ ఆఫ్ లో స్పై ఎలిమెంట్స్ తో కథని నడిపాడు.
క్లైమాక్స్ ఎపిసోడ్ ని మళ్లీ ఆకట్టుకునేలా చేసి ఓవరాల్ గా మొదటి భాగానికి ఏమాత్రం తగ్గని విధంగా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్. మీకు మొదటి భాగం నచ్చిందా… రెండో భాగం చాలా ఈజీగా నచ్చేస్తుంది. అక్కడక్కడా కొన్ని రిపీటెడ్ సీన్లు వచ్చినా ఓవరాల్ గా సినిమా ముగిసే సమయానికి ప్రేక్షకులు మంచి ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ తో రావడం ఖాయం.
నటులు : సిద్దు జొన్నలగడ్డ,అనుపమ,మురళీ శర్మ,ప్రిన్స్
దర్శకుడు : రామ్ మల్లిక్
రేటింగ్ : 3 / 5