Ram Charan : మెగా మనవరాలు క్లిమ్ కారా పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా క్లిమ్ కారా పుట్టకముందు..క్లింకర పుట్టాక అనే రేంజ్ లో మెగా ఫ్యామిలీ గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈమె పుట్టినప్పుడు మెగా ఫ్యామిలీకి అన్ని పాజిటివ్‌లు ఉన్నాయి కానీ, ఎక్కడ నెగటివ్ లు రావడం లేదు. అంతేకాదు స్వయానా మెగా ఫ్యామిలీకి లక్కీ బేబీ అని మెగాస్టార్ చిరంజీవి ఓపెన్‌గా చెప్పారు.
ఇప్పుడు తాజాగా క్లిమ్ కారాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. క్లిమ్ కారా పుట్టి దాదాపు 5 నెలలు కావస్తున్నా, అకీరా, అధ్యా ఇంకా క్లిమ్ కారా ముఖం కూడా చూడలేదట. వాళ్లకు ఇప్పటి వరకు తన ముఖం చూసే అవకాశం కూడా రాలేదట. నిహారిక పెళ్లి సమయంలో రేణు దేశాయ్ వాళ్లను పంపించింది. తప్పిస్తే ఆ తర్వాత ఎక్కడ కూడా వాళ్లను మీట్ అయ్యే ఛాన్స్ రాలేదు. ఇటీవల జరిగిన వరుణ్ పెళ్లికి రేణు, ఆద్య కూడా హాజరయ్యారు. అఖిరా రాలేదు. ఈ క్రమంలో ఇప్పటి వరకు క్లిం కారా ముఖం చూడలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే త్వరలో వరుణ్-లావణ్య భారీ పార్టీ పెట్టబోతున్నారట. ఆద్య, అకీరా కూడా ఈ పార్టీకి రాబోతున్నారు. అక్కడ వాళ్ళు పాపను చూసే అవకాశం వస్తుందేమో చూడాలి.